- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్లన్న రాజగోపురంను శుభ్రం చేసిన టీ ఎస్ ఎఫ్ ఈ రిస్క్యు టీం
దిశ,కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం దగ్గర పడుతున్న తరుణంలో అధికారులు, సిబ్బంది పనులలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా శనివారం ఆలయ రాజగోపురంను టీ ఎస్ ఎఫ్ ఈ రిస్క్యు( ఫైర్ సేఫ్టీ) సిబ్బంది శుభ్రం చేశారు.
మల్లన్న సన్నిధిలో ప్రముఖులు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని శనివారం ప్రముఖులు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా, వేరు వేరుగా మల్లన్న ఆలయనికి వచ్చిన ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖులలో సీనినటుడు సెల్వరాజ్, షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూది మెట్ల బాలరాజు, రాచకొండ కమిషనరెట్ సూపరిండెంటెట్ మల్లారెడ్డి తదితరులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు పడిగన్నగారి ఆంజనేయులు, సిద్దిమల్లన్న, రవి, మనోహర్, వినయ్ కొమురవెల్లిఎస్ ఐ రాజు గౌడ్, ధర్మకర్తలు ఉన్నారు.