కాసిం రజ్వీ లెక్క చేస్తున్నవు : రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరిశ్ రావు

by M.Rajitha |
కాసిం రజ్వీ లెక్క చేస్తున్నవు : రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరిశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి అబద్ధాలతోనే పరిపాలన చేస్తున్నడని సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరిశ్ రావు ఆరోపణలు చేశారు.. మూసీ కంపుకంటే ఈ సీఎం చెప్పే కంపే ఎక్కువ వస్తుందని, ఏడాదిగా చేసిందేమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీమంత్రి హరీశ్ రావు శనివారం మాట్లాడారు. మాకు మైక్ ఇవ్వద్దని స్పీకర్ పరోక్షంగా చెప్పి వెళ్లిపోయాడని ఆరోపించారు. ఎమ్మెల్యేల సంఖ్యకంటే మార్షల్స్ సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యేలు 119 మంది అయితే మార్షల్స్ 150 ఉన్నారని అన్నారు. కాసీం రజ్వీ లెక్క, ఒక రాజు లెక్క, నియంత లెక్క సీఎం చేస్తురని ఆరోపించారు. నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హైడ్రా మీద ప్రశ్నించిడంతో కూల్చివేతలపై ప్రభుత్వం వెనుకడుగు వేసిందంటే అది బీఆర్ఎస్ పోరాట ఫలితమేని అన్నారు. రైతుల మీద మిత్తీల భారం పడంది, ఓపెన్ డిస్కషన్ కు రేవంత్ నువ్వు వస్తవా, భట్టి వస్తరా, తుమ్మల వస్తరా అని ప్రశ్నిచారు. కాళేశ్వరమే లేకపోతే, మల్లన్నసాగర్ లేదు, నువ్వు హైదరాబాదుకు తెస్తమన్న 20 టీఎంసీల నీళ్లు లేవు అని అన్నారు. రూ. 7500 కోట్లు వానాకాలం రైతుబంధు , రూ. 2500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంటు, రూ. 2000 కోట్లు ముసలోళ్ల ఫించన్లు , రూ. 1000 కోట్ల బతుకమ్మ చీరెలు ఎగ్గొట్టినవు అని ఆరోపించారు .

సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడం బాధాకరమే అని అన్నారు. కొండారెడ్డిపల్లిలో నీ తమ్ముళ్ల వేధింపుల వల్ల మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు అని ప్రశ్నిచారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మేం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు, ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 2 వేల ఉద్యోగాలిచ్చినం అని అన్నారు. ఈ కార్ రేస్ మీద చర్చ పెట్టమంటే, పెట్టకుండా పోతరని అన్నారు. మీ ఏడాది పాలనలో 54 మంది విద్యార్థులు ప్రాణాలు పోగుట్టుకున్నారు. 89 మంది ఆటో డ్రైవర్లు ఆర్ధిక ఇబ్బందులలో మరణించారన్నారు. 29 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. 450 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నన్నారు. సోనియాగాంధీ ప్రసన్నం కోసం తెలంగాణ తల్లికి 1946 జీవో నంబర్ ఇచ్చారని, డిసెంబర్ 9న అసెంబ్లీ పెట్టారని అన్నారు. రాహుల్, ప్రియాంకతో పాటు 100 మంది ఎంపీలు ఆదానీ, ప్రధాని బొమ్మలున్న టీ షర్ట్స్ వేసుకొని పార్లమెంట్ కి వెళ్లొచ్చు కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీకి వెళ్లనివ్వరని అన్నారు. తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్య కాండ, గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ, రైతులకు బేడీలు వేసిన ఘటనలపై నిరసన తెలిపాం అన్నారు.

రాజీవ్ గాంధీ తెచ్చిన 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం, స్థానిక సంస్థలను బలోపేతం చేస్తమని మేనిఫెస్టోలో పెట్టారు తప్ప నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నరని అడిగినం అన్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ చేసిన అప్పు లక్షా 27వేల కోట్లు అని ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ 6లక్షల 37వేల కోట్ల అప్పు చేస్తదని వెల్లడించాం అన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని మాట తప్పిన కాంగ్రెస్ నైజానికి ఖాకీ షర్టులతో ఆటల్లో అసెంబ్లీకి చేరుకొని నిరసన తెలిపాం అన్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ఎకరా 75కోట్ల చొప్పున 30వేల కోట్లకు ప్రభుత్వం అమ్ముతున్న విషయాన్ని సభలో బయటపెట్టినం అన్నారు. అప్పుల విషయంలో ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకున్నదని అన్నారు. ప్రజల పక్షాన ఆరేడు రోజులపాటు ప్రజల గొంతుకగా శాసనసభలో ఎత్తి చూపినం అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed