- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతోంది: ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో ఇప్పటికీ కూడా కుల వివక్షత, అంటరానితనం , రెండు గ్లాసుల పద్ధతి ఇంకా కొనసాగుతోందని, గుళ్లు, దేవాలయాల్లోకి దళితులను రానివ్వడం లేదని బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలి దృష్టికి తీసుకుని వచ్చారు. శనివారం ఉదయం విధాన మండలి ప్రారంభం కాగానే స్పెషల్మెన్షన్ అంశాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుమతించగా.. ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభ ముందు ఉంచారు. కుల వివక్షత, అంటరానితనం ఇంకా కొనసాగడం సరికాదన్నారు. కుల వివక్షత నిర్మూలన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల చివరి ఆదివారం సివిల్రైట్స్డే గా పాటించి అస్పృశ్యత నివారణకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కాగా ఇప్పుడు పరిస్థతులు మళ్లీ మారుతున్నాయని, గ్రామాల్లో దళితులు హోటళ్లకు వెళితే ఎవరి గ్లాస్‌ను వారే కడుక్కోవాలంటూ రెండు గ్లాస్‌ల పద్దతి అమలు చేస్తున్నారని, ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా కొనసాగడం అన్యాయం అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ నివారించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వ పరంగా సివిల్రైట్స్డేను పెట్టుకుని ప్రతి నెల చివరి ఆదివారం అమలు చేశామని, ఎంఆర్ఓ, తహసీల్దార్ సాంఘీక సంక్షేమ శాఖ అధికారి, పోలీస్ఎస్ఐ, వీళ్లంతా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్య పరిచారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్రైట్స్డే జరపకపోవడం వల్ల రెండు గ్లాసుల పద్ధతి మళ్లీ పునరావృతం అవుతుందని కల్వకుంట్ల కవిత మండలి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రూరల్ క్రైమ్‌రేటు కూడా ఇటీవల కాలంగా పెరుగుతోందన్నారు. కుల వివక్షత విషయంలో అవకాశం ఉంటే మండల స్థాయిలో రాజకీయ ప్రజా ప్రతినిధులను కూడా అందులో చేర్పించి కుల వివక్ష తగ్గేలా చూడాలని కల్వకుంట్ల కవిత అన్నారు. అనంతరం తీన్మార్మల్లన్న మాట్లాడుతూ కిమ్స్ ఆసుపత్రిలో 60 నుంచి 70 శాతం వరకు మందిని ఇటీవల ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారినే నియమించుకోవడం వల్ల తెలంగాణకు చెందిన పారామెడికల్చదివిన యువత ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నరని తెలంగాణ బిడ్డలను నియమించుకున్న తర్వాతే సరిపోక పోతే ఆంధ్ర వారిని నియమించుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ జూనియర్డిగ్రీ కాలేజీల్లోని ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా ఏపీ వారికే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎంఎల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్సాక్షిగా రాహుల్‌గాంధీకి అవమానం జరిగిందని, ఈ ఘటనను తెలంగాణ విధాన మండలి ద్వారా ఖండించాల్సిన అవసరం ఉందని అవసరమైతే సభాధ్యక్షిడిగా మీరు ఒక నిర్ణయం తీసుకోండని సభ దృష్టికి తీసుకువచ్చారు.