- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt.: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఐపీఎస్ సంజయ్‌పై విచారణకు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్‌గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో ఏపీఎస్ సంజయ్ (IPS Sanjay) పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. ఇటీవలే విజిలెన్స్ అధికారులు (Vigilance Officers) లోతైన విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లుగా నిగ్గు తేల్చారు. వారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇటీవల సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ (CS Neerabh Kumar Prasad) సంజయ్ (Sanjay)ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలిండియా సర్వీసెస్ డిసిప్లేన్ యాక్ట్ (All India Services Discipline Act)- 1969లోని సెక్షన్ 3(1) కింద చర్యలు తీసుకుంది.
అదేవిధంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ (Fire Department)లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని ఏసీబీ అధికారులను (ACB Officers) ఆదేశించింది. ప్రస్తుతం జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. అయితే, యాంటీ కరెప్షన్ యాక్ట్-17A (Anti-Corruption Act-17A) ప్రకారం ఓ ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతి తప్పసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు సర్కార్‌ను రిక్వెస్ట్ చేశారు. సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో తాజాగా ఆయనను విచారించేందుకు ప్రభుత్వం ఏసీబీకి పర్మీషన్ ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విచారణ అనంతరం నేడో, రేపో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.