AE Certificate Verification: ఈనెల 27 నుంచి ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్

by Maddikunta Saikiran |
AE Certificate Verification: ఈనెల 27 నుంచి ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పలు ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను ఈనెల 27 నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్(Certificate Verification) నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్(Naveen Nicholas) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియ ఈనెల 31వ తేదీ వరకు నిర్వహిస్తుట్లు వెల్లడించారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాగా వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన గైర్హాజరైన అభ్యర్థులు, పెండింగ్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సిన వారికి వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు http://www.tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

Advertisement

Next Story