రాష్ట్రానికి రానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. 500 మంది రైతులతో ముఖాముఖి

by Mahesh |
రాష్ట్రానికి రానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. 500 మంది రైతులతో ముఖాముఖి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 25, 26న రెండు రోజుల పాటు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం తెలంగాణ సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. 25న ఉపరాష్ట్రపతి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడం తో పాటు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అదే రోజు రాత్రి కన్హా శాంతి వనం లో బస చేస్తారన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన జరిగే రెండు రోజుల పాటు బ్లూ బుక్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్, ఉపరాష్ట్రపతి కార్యాలయంతో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం వరకు అన్ని కీలక శాఖలు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, రవాణా, రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, రంగా రెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్, అధికారులు, ఆర్జీఐ ఎయిర్ పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed