Delhi Polls : ఢిల్లీ ఎన్నికల బరిలో ఐదుగురు మాజీ హోంగార్డులు

by Hajipasha |
Delhi Polls : ఢిల్లీ ఎన్నికల బరిలో ఐదుగురు మాజీ హోంగార్డులు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi polls) ఆమ్ ఆద్మీలు పోటీ చేయబోతున్నారు. అయితే వాళ్లు పోటీ చేసేది ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్) నుంచి కాదు. ఒకప్పుడు ఢిల్లీ బస్సుల్లో హోంగార్డులు(Delhi Bus Marshals)గా సేవలు అందించిన ఐదుగురికి జనహిత్ దళ్(Janhit Dal) పార్టీ అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. ఆరుగురు అభ్యర్థులతో ఆ పార్టీ శుక్రవారం రోజు జాబితాను విడుదల చేసింది. వారిలో ఐదుగురు గతంలో ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్ (హోంగార్డులు)గా సేవలు అందించిన వారే కావడం విశేషం.

మాజీ బస్ మార్షల్స్‌లో.. శ్యామో దేవికి నరేలా స్థానం, ప్రవీణ్ కుమార్‌కు ముండ్కా స్థానం, లలితా భాటీకి ముస్తఫాబాద్ స్థానం, ఆదిత్య రాయ్‌కు న్యూఢిల్లీ స్థానం, అనిల్ కుమార్‌కు బురారీ స్థానం కేటాయించారు. మరో అభ్యర్థి రాకేశ్ రంజన్ శ్రీవాస్తవకు జనహిత్ దళ్ పార్టీ నుంచి తిమార్‌పూర్ అసెంబ్లీ టికెట్ లభించింది. 2023 సంవత్సరంలో ఉద్యోగాల నుంచి తొలగించిన దాదాపు 10వేల మంది ఢిల్లీ బస్ మార్షల్స్‌‌ను సివిల్ డిఫెన్స్ వలంటీర్లుగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే ప్రతిపాదనను ఆప్ సర్కారు పరిశీలిస్తోంది. ఈ అంశంపై బీజేపీ, ఆప్ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో ఐదుగురు మాజీ ఢిల్లీ బస్ మార్షల్స్‌‌‌కు అసెంబ్లీ టికెట్లను కేటాయిస్తూ జనహిత్ దళ్ పార్టీ ప్రకటన చేసింది.

Advertisement

Next Story

Most Viewed