కాకినాడ పోర్ట్ కేసులో స్పీడ్ పెంచిన సీఐడీ

by Mahesh |
కాకినాడ పోర్ట్ కేసులో స్పీడ్ పెంచిన సీఐడీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ పోర్ట్ కేసు(Kakinada Port Case) రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును సీఐడీకి ప్రతిష్టాత్మకంగా తీసుకొవడంతో అందరి దృష్టి ఈ కేసు పైనే ఉంది. కొద్ది రోజుల పాటు నెమ్మదిగా సాగిన కాకినాడ పోర్ట్ కేసులో సీఐడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా.. శరత్‌ చంద్రారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాగా సీఐడీ నోటీసులపై స్పందించిన శరత్ చంద్రారెడ్డి.. ఈనెల 24న విచారణకు హాజరవుతానని వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఇదే కేసులో ఇప్పటికే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ (Kakinada Seaports Ltd)కెఎస్‌పిఎల్) సంస్థ డైరెక్టర్లు సుందర్, విశ్వనాథ్ హాజరయ్యారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ (కెఎస్‌పిఎల్), కాకినాడ సెజ్ (కెఎస్‌ఇజెడ్) షేర్లను అక్రమంగా బదలాయించారని కేఎస్‌పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed