Bhagyashri Borse: ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నా.. చాలా ఏడ్చానంటూ భాగ్య శ్రీ బోర్సే ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-12-21 12:14:41.0  )
Bhagyashri Borse: ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నా.. చాలా ఏడ్చానంటూ భాగ్య శ్రీ బోర్సే ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే((Bhagyashri Borse)) మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’(Mr. Bachchan) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ సాధించలేకపోయింది. కానీ ఈ చిత్రంతో భాగ్య శ్రీ బోర్సే మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తన అందం అభినయం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఆమె కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ పోతినేని(Ram Pothineni) సరసన ‘రాపో-22’(Rapo-22) సినిమాలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది.

తాజాగా, భాగ్యశ్రీ బోర్సే ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘2024 దాదాపు ముగుస్తోందని నమ్మలేకపోతున్నాను.. కొత్త ప్రారంభంతో కొత్త సంవత్సరం మన ముందుకు రాబోతుంది. నేను నవ్వాను, చాలా ఏడ్చాను, ఎన్నో కలలు కన్నాను. కష్టాలు చూశాను కానీ నేను చెప్పేది ఒక్కటే. మీ అందరికీ నేను కృతజ్ఞురాలిని. నేను ఎప్పుడూ కలలు కనే చాలా ప్రేమను మీ నుంచి పొందాను. ఇన్కమింగ్ ఇంకా చాలా మ్యాజిక్ ఉందని నాకు తెలుసు. అన్ని కష్టాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. త్వరలో మీ అందరితో పంచుకోవడానికి చాలా కథలు ఉన్నాయి’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed