- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వల..

దిశ, యాచారం : ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి పేరుతో తనతో తీసుకెళ్లిన యువకుడి పై కేసు నమోదైన ఘటన శుక్రవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నందీశ్వర్ రెడ్డి, తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం బీహార్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం మొండి గౌరెల్లి, పరిధిలోని శ్రీ సాయి పౌల్ట్రీ ఫారం లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అదే కుటుంబానికి చెందిన మైనర్ బాలిక(14) ఫోన్లో సికింద్రాబాద్, రాజీవ్ గాంధీ నగర్, లో నివాసం ముండే సునీల్ కుమార్, (19) మాట్లాడుతూ.. చాట్ చేస్తూ ఉండడంతో బాలిక తండ్రి తీవ్రంగా మందలించాడు. మరుసటి రోజు బాలిక కనిపించకుండా పోయింది. బాలిక కుటుంబ సభ్యులు స్కూల్, చుట్టుపక్కల బంధువుల వద్ద వెతకగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో అనుమానంతో 3 నెలలుగా మైనర్ బాలిక తో చనువుగా ఉంటున్న సునీల్ కుమార్ పై బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా పెళ్లి చేసుకుంటానని తనతో తీసుకు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.