పోలీసులకు అడ్డంగా బుక్కైన మట్కా రాయుళ్లు..

by Sumithra |
పోలీసులకు అడ్డంగా బుక్కైన మట్కా రాయుళ్లు..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జండా గల్లిలో గల మందుల రమేష్ ఇంట్లో మట్కా ఆడుతున్న ముగ్గురు మట్కా రాయుళ్లయిన మందుల రమేష్, ఏంసల రాజు, టాకుర్ అజయ్ లని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. మట్కా రాయుళ్ల వద్ద నుంచి మట్కా చీటీలను, మూడు సెల్ ఫోన్లు, 14,000 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. గేమింగ్ యాక్ట్ ప్రకారం అనుమతులు లేని మట్కా, పేకాట ఆటలను ఆడడం చట్టరీత్యా నేరమని ఆటగాళ్ల స్థావరాల పై దాడి చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు.

Next Story

Most Viewed