ప్రేమించి గర్భవతిని చేసి.. కులం తక్కువన్నాడు

by Naveena |
ప్రేమించి గర్భవతిని చేసి.. కులం తక్కువన్నాడు
X

దిశ, ఎల్లారెడ్డి : తనను ప్రేమించి నాలుగు సంవత్సరాలు తనతో సంసారం చేసి మోసం చేశాడని భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తన కులం తక్కువ అని తనను నడిరోడ్డులో వదిలేశాడని యువతి వాపోయింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే లింగంపేట్ మండలం కోమట్పల్లి గ్రామం కేశయపేట కు చెందిన, నెల్లూరి భాగ్య, ( 23 ), కులం ఎస్సీ మాదిగ. సాహిత్య గ్రామం కోమటిపల్లి కి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన సిటురి రాకేష్( 23) కులం ముదిరాజ్, వీరిద్దరూ హైదరాబాద్ లో గత నాలుగు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నట్లు యువతి తెలిపారు.

యువతి ఆరు నెలల గర్భం దాల్చింది. రాకేష్ అప్రమత్తమై ఆమె కడుపులో నుంచి గర్భాన్ని హైదరాబాద్ లోనే నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స చేయించి, గర్భాన్ని తొలగించినట్లు యువతి నెల్లూరు భాగ్య తెలిపారు. రాకేష్ ఇంటి ముందు శుక్రవారం కుటుంబ సభ్యులతో ఆమె తన భర్త కావాలని, న్యాయం జరిగే వరకు తన భర్త ఇంటిముందే ధర్నా చేస్తానని మోరాయించింది. గతంలో కూడా లింగంపేట పోలీస్ స్టేషన్ లో రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ.. తన భర్త నమ్మబలికించి ఇంటికి తాళం వేసుకొని పారిపోయినట్లు ఆమె తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు ఎక్కడికి వెళ్లనని ఆమె ఆరోపించింది.

Next Story

Most Viewed