ఇక ఫోన్ ఇన్ ద్వారా ప్రజావాణి

by Sridhar Babu |
ఇక ఫోన్ ఇన్ ద్వారా ప్రజావాణి
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ప్రతి సోమవారం టెలిఫోన్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం తెలిపారు. వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సోమవారం నుండి ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు వీలుగా ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు టెలిఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఇందులో భాగంగా ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే 91005 77132 ఫోన్ నంబర్ ద్వారా నేరుగా తమ సమస్యలను తెలపాలని కోరారు. లేదా వాట్సప్ ద్వారా పంపవచ్చన్నారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్ లో నమోదు చేసి పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు యధావిధిగా సాధారణ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని దూర ప్రాంత ప్రజలు టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Next Story