Megastar Chiranjeevi post: మెగాస్టార్ బ్యాక్ టు హోమ్.. ఎయిర్‌పోర్ట్ వద్ద అదిరిపోయే స్టిల్ వైరల్

by Anjali |
Megastar Chiranjeevi post: మెగాస్టార్ బ్యాక్ టు హోమ్.. ఎయిర్‌పోర్ట్ వద్ద అదిరిపోయే స్టిల్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇటీవలే ఈ నటుడు లండన్‌(London)కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి ఫ్రాన్స్‌ చిరుకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్యానర్లు పట్టుకుని తెగ గోల చేశారు. వెల్కమ్ అన్నయ్య అంటూ సందడి చేశారు. మెగాస్టార్ కూడా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అప్యాయంగా మాట్లాడుతూ నవ్వుతూ పలకరించారు.

ఇక మెగాస్టార్ యూకే పార్లమెంట్‌(UK Parliament)లో భాగమైన హౌస్ ఆఫ్ కామన్స్(House of Commons) నుంచి అరుదైన సత్కారం అందుకుని తెలుగు వారి ఖ్యాతిని మరింత పెంచారు. కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవల్ని గుర్తించి.. మెగాస్టార్‌కు మార్చి 19 వ తేదీన అవార్డుతో సత్కరించారు. ఈ నటుడు గతేడాది పద్మ విభూషణ్‌(Padma Vibhushan)ను అందుకున్నవిషయం తెలిసిందే. డ్యాన్స్‌కు గాను చిరు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా పోయిన సంవత్సరమే దక్కించుకున్నారు.

గిన్నీస్ బుక్‌లో ఎక్కారు. ప్రస్తుతం యూకే పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సంపాదించుకున్నారు. అయితే చిరు లండన్ నుంచి తిరిగి ఇంటికి బయల్దేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు. ఎయిర్‌పోర్ట్ వద్ద దిగిన అదిరిపోయే స్టిల్‌తో పాటు.. ‘లండన్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు’ అని పోస్ట్‌లో ఓ క్యాప్షన్ కూడా జోడించారు.

Next Story