- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గాలివానకు నష్టపోయిన రైతులు.. నేలకొరిగిన పంట..

దిశ, రాజంపేట : మండలంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన గాలి వానతో మొక్కజొన్న పంట భారీగా నష్టం వాటిల్లిందని రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటకు వానకు తోడు గాలి రావడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో రైతులు నిండా మునిగిన పరిస్థితి ఏర్పడింది. కొంత మంది రైతులు కోసిన మొక్కజొన్న కంకులు వర్షానికి నాని పోయాయని, మొలకలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చిన సమయంలో నేలపాలు అయిందని, మళ్లీ ఒకటి రెండు రోజులు వర్షాలు పడే సూచన ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
రాజంపేట మండలంలో ఈసారి అత్యధిక రైతులు ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటలు సాగు చేశారు. అనుకోకుండా వచ్చిన గాలి వానతో మొక్కజొన్న పంట వెతికి వచ్చే సమయంలో నేలపాలైందని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకు చాలా వరకు నష్టం జరిగిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గాలి వానకు నష్టపోయిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ అధికారి శృతి పరిశీలించారు. శుక్రవారం కురిసినటువంటి వర్షానికి రాజంపేట మండలంలోని తలమడ్ల, ఆరేపల్లి, ఆర్గోండ బసన్నపల్లి గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను సంబంధిత గ్రామ రైతులతో కలిసి ఏఈఓలు సందర్శించారు. ప్రాథమిక అంచనాగా రాజంపేట మండలంలో 26 ఎకరాల మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారి శృతి తెలిపారు.