- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DOT: రోజుకు 8-10 సార్లు సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ ప్లే చేయాలి.. టెలికాం కంపెనీలకు డాట్ కీలక ఆదేశాలు..!
దిశ,వెబ్‌డెస్క్: భారతదేశంలో గత కొంత కాలంగా ఆన్‌లైన్ మోసాలు(Online Scams) విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్న సంగతి గుర్తుండే ఉంటుంది. కాల్స్(Calls), మెసేజ్‌లు(Messeges), ఈ మెయిల్స్(E-mails), వాట్సాప్(whatsapp), టెలిగ్రామ్(Telegram) ఇలా అందుబాటులోని ప్రతి అవకాశాన్ని వాడుకుని ప్రజలకు వల వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై(Cyber Crimes) ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఈ మేరకు నెట్ వర్క్ కంపెనీల(Network Companies)కు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DOT) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఫోన్ యూజర్లకు మూడు నెలల పాటు డైలీ 8 నుంచి 10 సార్లు సైబర్ భద్రతపై అవేర్ నెస్ కాలర్ ట్యూన్(Awareness Caller Tune) ప్లే చేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్' అందించే కాలర్ ట్యూన్లను ప్లే చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డాట్ తెలిపింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడల్లా సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్స్ వినపడనున్నాయి.