Harish Rao : రేవంత్ రెడ్డి అబద్దాల్లో గిన్నీస్ రికార్డుకు ఎక్కుతారు : హరీష్ రావు

by M.Rajitha |
Harish Rao : రేవంత్ రెడ్డి అబద్దాల్లో గిన్నీస్ రికార్డుకు ఎక్కుతారు : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిహరీష్ రావు(HarishRao).. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిఅబద్దాలు చెప్పడంలో కచ్చితంగా గిన్నీస్ బుక్ రికార్డు(Guinness Book Record) కు ఎక్కుతారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) జరిగిన ఈ ఐదారు రోజుల్లో సభలోనే ఇది ప్రూవ్ అయిందని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమాపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం రెండు గంటల ప్రసంగంలో అన్నీ అబద్దాలే చెప్పారని, అబద్దాలు చెప్పడంలో తప్పకుండా గిన్నీస్ రికార్డ్ లోకి చేరతారని అన్నారు. రుణమాఫీ రూ.2 లక్షలకు పైన ఉంటే మొత్తం చెల్లించండి, తిరగి మీ అకౌంట్లో వేస్తామని రేవంత్ రెడ్డి చెబితే మళ్ళీ అప్పుచేసి సకాలంలో రైతులు చెల్లించారని.. అంతా చేస్తే సగం మందికి కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీని ఒక్క కిలోమీటర్ తవ్వలేదని అబద్దం చెప్పారని, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 11 కిమీలకు పైగా తవ్వినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story