కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రేమించిన స్టార్ హీరోయిన్.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్..!

by Kavitha |
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రేమించిన స్టార్ హీరోయిన్.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్..!
X

దిశ, సినిమా: భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారిలో గాంధీ ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించారు. అలాంటి గాంధీ కుటుంబం నుండి వచ్చిన వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రెసెంట్ రాజకీయాల్లో ఉన్నారు. అయితే 50 ఏళ్లు దాటిన కూడా రాహుల్ గాంధీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసినదే. అయితే అప్పట్లో ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడిందట. ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తోంది. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే..

చాలా కాలం నుండి కపూర్ ఫ్యామిలీకి గాంధీ ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్ ఉండేదట. ఇక ఈ అనుబంధంతోనే రాజీవ్ గాంధీకి రాజ్ కపూర్ కూతురు రీతూ కపూర్‌ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. కానీ అప్పటికే రాజీవ్ గాంధీ సోనియా గాంధీతో ప్రేమలో ఉండటం వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత రాజ్ కపూర్ మనవరాలు కరీనాకపూర్‌కి రాహుల్ గాంధీ అంటే పిచ్చి ఇష్టం అంట. అంతేకాదు ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైం లో మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా ఠక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పిందట.

అలాగే రాహుల్ గాంధీకి కూడా కరీనా కపూర్ అంటే ఇష్టం ఉండేదట. కానీ ఆయన అంతగా బయట పెట్టలేదట. అంతేకాదు కరీనా కపూర్ సినిమాలు విడుదలైతే ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా చూసేవారట. అయితే అంతగా ఇష్టపడ్డ వారి మధ్య క్రమక్రమంగా ప్రేమ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే సినిమాల్లో బిజీగా ఉంటూ కరీనా.. రాజకీయలో బిజీ బిజీగా ఉంటూ రాహుల్ పెళ్లికి దూరమయ్యారు. ఆ తర్వాత కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ ‘తన నేత అభినేతా’ అనే పుస్తకంలో రాసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.


Next Story