మీకు తెలుసా.. లోపల బాధపడుతూ, పైకి నవ్వడం కూడా ఒక రోగమేనంట!

by Jakkula Samataha |
మీకు తెలుసా.. లోపల బాధపడుతూ, పైకి నవ్వడం కూడా ఒక రోగమేనంట!
X

దిశ, ఫీచర్స్ : మనిషికి బాధ ఉండటం అనేది సహజం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయం పట్ల బాధపడుతూనే ఉంటారు. అయితే కొందరు తమ బాధను బంధువులు, స్నేహితులకు చెప్పుకుంటే, మరికొందరు మాత్రం తనలోనే బాధను దాచుకొని, పైకి నవ్వుతూ కనిపిస్తారు. ఇలా ఫేక్ స్మైల్‌తో తన కుటుంబ సభ్యులను మోసం చేస్తుంటారు. అయితే ఇలా లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ కనిపించడం కూడా ఓ రోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే, లోపల చాలా బాధ, డిప్రెషన్‌లో ఉండి కూడా పైకి నవ్వుతూ కనిపిస్తారు. అయితే దీనిని స్మైలింగ్ డిప్రెషన్ అంటారంట.

ఇది ఓ మానసికమైన ఆరోగ్య సమస్య. దీనిని త్వరగా గుర్తించాలంట. లేకపోతే ఈ సమస్యతో బాధపడే వారు ఆత్యహత్య కూడా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులును గుర్తించడం కూడా చాలా కష్టం.ఎందుకంటే, వీరు ఫేక్ స్మైల్‌తో కనిపిస్తూ అందరిని మాయ చేస్తుంటారు. కానీ కొన్ని లక్షణాల ద్వారా వీరిని ఈజీగా గుర్తు పట్టవచ్చు. స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తులు ఎక్కువగా అలసట, నిరాశలో, ఏ పని చేయలేకుండా , చాలా మూడిగా కనిపిస్తారు. అంతే కాకుండా వీరు బిగ్గరగా కాకుండా చాలా చిన్నగా నవ్వుతుంటారు. అలాగే ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలతో కనిపించిన ప్రతి వ్యక్తితో ఓపెన్‌గా మాట్లాడాలంట. వారి సమస్య ఏంటో తెలుసుకొని, దానికి తగు పరిష్కారం చూపాలి. అంతే కాకుండా స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు మంచి ఆహారం తీసుకోవడంమే కాకుండా, రోజూ వ్యాయామం చేయాలి. ఒంటరిగా కాకుండా స్నేహితులతో, బంధువులతో ఎక్కువ సేపు గడపడానికి ఆసక్తి చూపాలంట. ప్రతి విషయాన్ని మీరు క్లోజ్ ఫ్రెండ్ అని భావించే వ్యక్తితో పంచుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీని వలన వారు డిప్రెషన్ నుంచి బయటపడటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారంట.

Next Story