మల్లంపేట మాజీ సర్పంచ్ బరితెగింపు.. ఎన్‌ఓసీ లేకుండా అక్రమ నిర్మాణాలు

by Shiva Kumar |
మల్లంపేట మాజీ సర్పంచ్ బరితెగింపు.. ఎన్‌ఓసీ లేకుండా అక్రమ నిర్మాణాలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో ఓ మాజీ సర్పంచ్ ప్రభుత్వ భూమిలో తప్పుడు పత్రాలను సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడు. అయితే ఆ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ అధికారులు వాటిని మే 21న కూల్చివేశారు. కానీ, కూల్చిన చోటే మళ్లీ భూ కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఎక్స్ సర్వీస్‌ మెన్ ల్యాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయాలన్నా, నిర్మాణాలు చేపట్టాలన్నా సంబంధించిన జిల్లా కలెక్టర్ ఎన్‌వోసీ తప్పనిసరి. కానీ, మల్లంపేట పరిధిలోని సర్వే నెం.170/యూలో ఎటువంటి ఎన్ఓసీ లేకుండా 5 ఎకరాల స్థలంలో ఇప్పటికే సుమారు రెండు ఎకరాల స్థలంలో ఎస్.ఎన్ నర్సింగరావు గార్డెన్ పేరుతో స్థానిక మాజీ సర్పంచ్ అక్రమ నిర్మాణాల చేపట్టార. మరో 150 గజాలలో కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణాన్ని సైతం చేడపడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు

మల్లంపేట సర్వే నెం.170/యూలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ భారతి మే21న అక్రమనిర్మాణాలను కూల్చివేశారు. మళ్లీ కూల్చిన చోటే అక్రమ నిర్మాణాలను చేపడుతుండడంతో సదరు నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయంలోఆర్‌ఐ2ని వివరణ కోరగా.. గతంలో అక్రమ నిర్మాణమని ఫిర్యాదు రావడంతో కూల్చివేతల చేపట్టామని తెలిపారు.

ఫేక్ డాక్యూమెంట్లతో అక్రమ నిర్మాణాలు

మల్లంపేట సర్వే నెం.173/6, సర్వే నెం.173/8లో ఇంటి నెం.3-19/4/L తో టీఎస్ బీపాస్ నంబర్.379658/డీయూఎన్‌‌డీ/0241/24 పేరిట 287 గజాలకు అనుమతి పొందిన నిర్మాణదారుడు అధికారుల కల్లుగప్పి 170/యూలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. 12216 /2024 ప్రకారం మే 14న హై‌కోర్ట్‌లో పిటీషన్ కూడా దాఖలైంది, అండర్ సెక్షన్ 174(4)(10) ఆఫ్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం ఏప్రిల్ 4న పరిశీలించిన జస్టీస్ కె.లక్ష్మణ్ అనుమతులు రద్దు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు అనుమతులను రద్దు చేశారు.

కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్

ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని దుండిగల్ మండల తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ హెచ్చరించారు. మల్లంపేట సర్వే నెం.170/యూ ప్రభుత్వ భూమిలో తప్పుడు పత్రాలతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించి మే నెలలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశాం.

Next Story