కేసీఆర్ పాలనలో ఫుడ్ సేఫ్టీ.. విన్నామా?.. చూశామా? కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
కేసీఆర్ పాలనలో ఫుడ్ సేఫ్టీ.. విన్నామా?.. చూశామా? కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్ల కేసీఆర్ పాలనలో అద్దాల మేడలు - రంగుల గోడలు చూసి మురిసిపోయామని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. హైదరాబాద్ లో కోటికి పైగా జనాభా ఉన్నారని, మెజారిటీ మధ్య తరగతి ప్రజలు ఉదయం లేస్తే ఉద్యోగ బాధ్యతల కోసం ఉరుకులు పరుగులతో గుడుపుతారని వెల్లడించింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారం కోసం కట్టుకున్న ఆకాశహార్మ్యాలను చూసి ఆహా అభివృద్ధి అంటే ఇది అని సంబర పడ్డామన్నది.

కేటీఆర్ లాంటి లీడర్ ఉండటం వల్లే ఇదంతా అని జబ్బలు చరుచుకున్నామని తెలిపింది. కానీ, ‘పొద్దున్నే లేస్తే మనం ఏం తాగుతున్నాం ఏం తింటున్నాం.. మనం తినే తిండి శుభ్రమైనదేనా హోటల్స్, రెస్టారెంట్లు సేఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నాయా? అలాంటి ఆహారం తింటే మన ఆరోగ్యం పరిస్థితి ఏంటి? పదేళ్లు ఒక్క రెస్టారెంట్ మీద కానీ ఒక్క హోటల్, మెడికల్ షాప్ మీద కానీ ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఇన్ స్పెక్షన్ చేయడం కానీ, నియంత్రణ చేస్తున్నారని కానీ విన్నామా… చూశామా’ అని పేర్కొంది.

కానీ, గడచిన ఆరు నెలల్లో వారానికి సగటున రెండు మూడు వార్తలు ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఇన్ స్పెక్షన్ల గురించి వింటున్నామని వెల్లడించింది. దీంతోనే అంతా ఐపోతుందని కాదు.. కనీసం వ్యవస్థలు పని చేస్తున్నాయన్న నమ్మకం వస్తోందని పేర్కొంది. అభివృద్ధి అంటే అంబేద్కర్ చెప్పినట్టు అద్దాల మేడలు- రంగుల గోడలు కాదు. ప్రజలు స్వేచ్ఛగా, హాయిగా, నాణ్యమైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితి ఉండటం. ప్రతీ హైదరాబాదీ ఆలోచన చేయాలని పిలుపునిచ్చింది.

Next Story

Most Viewed