పాపం కీర్తి.. ఆ అవకాశం కోసం గ్లామర్ షోకు కూడా వెనకాడట్లేదుగా..

by srinivas |   ( Updated:2022-09-21 14:48:33.0  )
పాపం కీర్తి.. ఆ అవకాశం కోసం గ్లామర్ షోకు కూడా వెనకాడట్లేదుగా..
X

దిశ, సినిమా: 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్.. తక్కువ కాలంలోనే స్టార్స్ సరసన నటించి అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. 'మహానటి'గా కీర్తించబడింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్న ఆమె.. ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది.

ఈ ఏడాది 'సర్కార్ వారి పాట'లో మహేష్ సరసన మెరిసిన కీర్తి టాప్ హీరోయిన్‌గా ఇతర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కమర్షియల్ సినిమాల్లో అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తున్న బ్యూటీ.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో చాన్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో చెల్లెలి పాత్ర పోషిస్తోంది కీర్తి.

Advertisement

Next Story