నా కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా అదే.. కృతి సనన్ ఆసక్తికర కామెంట్స్

by sudharani |
నా కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా అదే.. కృతి సనన్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ‘వన్ నేనొక్కడినే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఫస్ట్ సినిమా అనుకున్నంత ఫలితం దక్కించుకోకపోవడంతో.. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. తర్వాత ‘దోచెయ్’, ‘ఆదిపురుష్’ మూవీస్ చేసింది. అవి కూడా డిజాస్టర్ కావడంతో.. బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘దో పత్తీ’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. గతేడాది వచ్చిన ‘మిమీ’ సినిమాలో తన నటనకుగానూ అంతర్జాతీయ అవార్డు అందుకుంది. ఈ చిత్రం తన జీవితాన్నే మార్చేసింది అంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని సినిమాలు మాత్రమే ఉంటాయి. కానీ వాళ్లకు నచ్చిందంటే మంచి సక్సెస్‌ను ఇస్తారు. నా ‘మిమీ’తో అదే జరిగింది. ఈ మూవీకి మంచి సక్సెస్ ఇచ్చారు. దీంతో నా కెరీర్ మరోస్థాయికి చేరుకుంది. ఈ చిత్రం తర్వాత నాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాను. ఓ నటిగా నా జీవితానికి కావాల్సినన్ని అద్భుతమైన క్షణాలను అందించిన ఈ సినిమా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed