- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ రికార్డులు దగ్ధం.. ఇద్దరు నిందితులు అరెస్ట్.. వెలుగులోకి కీలక నేత పేరు..
దిశ వెబ్ డెస్క్: నిన్న రాత్రి డ్రైవర్ నాగరాజు, రామారావు అనే వ్యక్తులు ఇన్నోవా కారులో అనేక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, లెటర్ హెడ్స్, క్యాసెట్‌లు తీసుకుని విజయవాడలోని యనమలకుదురు కట్ట మీదకు చేరుకున్నారు. అనంతరం వాటిని తగల బెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఇది గమనించిన స్థానికులు పెనుములూరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న రక్షకబట్టులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కాలిపోతున్న రికార్డులను పరిశీలించిన ఖాకిలు, తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్, పొల్యూషన్ శాఖలకు సంబంధించినవిగా గుర్తించారు. అలానే దగ్ధమౌతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్‌మెన్ సమీర్ షర్మ ఫోటోలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో వాటిని ఎందుకు ధ్వంశం చేయాలని అనుకున్న నాగరాజు, రామారావులను పోలీసులు విచారించింగా, పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్‌మెన్ సమీర్ షర్మ ఆదేశాలు మేరకు వాళ్లు ఆ పత్రలాను తగలబెట్టినట్టు విచారణలో తేలింది.
ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. నేరస్తులు ఈ పత్రాలను ఎక్కడి నుండి తెచ్చారు..? ఎందుకు నాశనం చేయాలని చూశారు..? అనే అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అలానే ఈ ఘటన వెనక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.