బాసరలో భక్తుల రద్దీ..

by Sumithra |
బాసరలో భక్తుల రద్దీ..
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరుసగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు రావడంతో పాటు గురువారం సఫల ఏకాదశి శుభముహూర్తం ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు, శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వణాధికారి నవీన్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువ జామున శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ఆలయ అర్చక వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, అర్చన, గణపతి, సరస్వతి మాత పారాయణం వంటి విశేష పూజలు నిర్వహించి భక్తులకు హారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed