- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ ’ ట్రెండ్ సెట్టర్.. ‘దిశ ’ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ..
దిశ బ్యూరో, ఖమ్మం : నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే ‘దిశ’ దినపత్రిక ట్రెండ్ సెట్టర్ ను క్రియేట్ చేసిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం కల్లూరు మండలంలోని నారాయణ పురంలోని ఆయన స్వగృహంలో దిశ దినపత్రిక - 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించి, పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వేగంగా వార్తలు అందించడమే ముఖ్యమని, డిజిటల్ మీడియాలో ఆ వేగాన్ని దిశపత్రిక సమర్థవంతగా అందుకున్నదని తెలిపారు. ఎప్పటి వార్తలు అప్పుడే ప్రచురిస్తూ.. కాలానికి అనుగుణంగా పరుగులు పెడుతున్న దిశ.. అతి తక్కువ వ్యవధిలోనే ప్రజల మన్ననలు అందుకున్నదని చెప్పారు.
2025 సంవత్సరంలో ప్రజాప్రభుత్వంలో పేదలందరికీ లబ్ధి చేకూరుతుందని, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయన్నారు. ప్రజలందరికీ కొత్త సంవత్సరంలో శుభం కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రిక అనుసంధానకర్తగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని సూచించారు. అనంతరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో కాలానికి అనుగుణంగా ‘దిశ’ దినపత్రిక పరుగులు పెడుతూ ముందుకు సాగుతుందన్నారు. అనేక మంది జర్నలిస్టులకు ఈ పత్రిక ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, దిశ బ్యూరో ఇంచార్జ్ సాగర్ దువ్వ, విలేకరులు రామచంద్ర మూర్తి, అంజద్, యాస లక్ష్మారెడ్డి, సుధాకర్, N. అనిల్ కుమార్ తదితరులున్నారు.