Sub Committee: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-12-26 16:26:13.0  )
Sub Committee: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Film Industry)లో సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. ఇవాళ హైదాబాద్‌ (Hyderabad)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Control Command Center)లో జరిగిన సినీ ప్రముఖులతో భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్‌ (Tollywood)లో సమస్యల పరిష్కారానికి త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committe) ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, ఇండస్ట్రీ నుంచి ఇద్దరు నిర్మాతలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే, సబ్ కమిటీ నిర్ణయాల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read More...

సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హాజరుకాని చిరంజీవి.. అసలు కారణం ఇదే!


Advertisement

Next Story