China : ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్‌.. నిర్మాణానికి చైనా సన్నాహాలు

by Hajipasha |
China : ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్‌.. నిర్మాణానికి చైనా సన్నాహాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : చైనా మరో రికార్డును క్రియేట్ చేయబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్‌ను డ్రాగన్ నిర్మించబోతోంది. భారత్ పొరుగున ఉండే టిబెట్‌లో ఈ డ్యామ్ నిర్మాణాన్ని చైనా చేపట్టనుంది. టిబెట్‌లోని తూర్పు భూభాగంలో ఈ డ్యామ్ నిర్మాణానికి ప్రణాళికను రెడీ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బంగ్లాదేశ్, భారత్‌ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో నది దిగువ ప్రాంతంలో ఈ హైడ్రోపవర్ డ్యామ్ ఉంటుంది. ఈ విద్యుత్ ప్రాజెక్టు నుంచి ఏటా 300 బిలియన్ల కిలోవాట్ అవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ‘త్రీ గార్జెస్’ చైనాలోనే ఉంది. ఈ ప్రాజెక్టు ఏటా 88.2 బిలియన్ల కిలోవాట్ అవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అంటే అంతకంటే మూడు రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కెపాసిటీ కొత్త ప్రాజెక్టు సొంతం.

Advertisement

Next Story

Most Viewed