పచ్చని చెట్ల పై గొడ్డలి వేటు..

by Sumithra |
పచ్చని చెట్ల పై గొడ్డలి వేటు..
X

దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి కార్మిక క్షేత్రాలు ఆనుకోని ఉండటం వల్ల ఒకవైపు కాలుష్యం పెరుగుతుంది. దాని దుష్పరిణామాలను నిలువరించి, పర్యావరణానికి మేలు చేకూర్చడంలో చెట్లు పోషిస్తున్న పాత్ర ఎంతో ఉంది. విలువైన చెట్లను కాపాడుకోవాల్సింది పోయి. నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వాలు మొక్కలను పెంచేందుకు కార్యక్రమాలు, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ముందుకు సాగుతుంటే కొందరు రోడ్ల పై, ఇతర ప్రయోజనలకు అడ్డుగా ఉందంటూ చెట్లను నరికివేస్తున్నారు. పట్టణంలోని తారకరామ కాలనీ ఒకటవ వార్డులో నిర్మిస్తున్న బతుకమ్మ గ్రౌండ్ కు అడ్డుగా ఉన్నాయనో, మరేదో కారణంగా పచ్చదనం పై వేటు వేస్తున్నారు.

పురపాలకానికి చెందిన జేసీబీతో చెట్లను కొట్టి వేస్తున్న పుర అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఇదే తరహాలో జయశంకర్ విగ్రహానికి అనుకోని ఉండే ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన వాహనంతో చెట్లను తొలగించగా అటవీ శాఖ అధికారులు గతంలో ఉండే కమిషనర్ కి నోటీసులు జారీ చేసి పెద్ద మొత్తంలో ఫైన్ వేసినట్లు సమాచారం. పచ్చదనం పై గొడ్డలి వేటు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖతో పాటు మున్సిపాలీటి అధికారులు కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ, అడిగేవారు లేక చర్యలు తీసుకోలేని పరిస్థితి. చెట్లను నరికివేత పెద్ద నేరమేమీ కాదనే భావన ప్రజల్లో పెరుగిపోతుంది. మరి దీని పై పుర, అటవీశాఖ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed