Brahmamudi : ఇంట్లో రూల్స్ మార్చిన కళావతి

by Prasanna |
Brahmamudi : ఇంట్లో రూల్స్ మార్చిన కళావతి
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

" ఇంట్లో తినడానికి ఒక్క కర్రీ చేపిస్తూ.. నీకు నక్లెస్‌కి పది లక్షలు ఇచ్చిందా?’ అని అంటుంది ధాన్యం కోప పడుతూ ఉంటుంది. కవర్ చేయాలనీ చూస్తుంది స్వప్న. ‘నేను ఖర్చులకు అడిగితే అన్ని లెక్కలు చెప్పిద్ది. నువ్వు అడిగితే పది లక్షలు ఇచ్చేసిందా?’ అని రుద్రాణీ అంటుంది.

‘అంతే.. కొన్ని ముఖాలు చూస్తే డబ్బులు ఇవ్వాలనిపించదేమో.. అందుకే నీకు ఇవ్వలేదు.. హా .. ఎంతైనా నా చెల్లి బంగారం.. అక్కడ బోసిపోకూడదని నక్లెస్ కొనుక్కోమని డబ్బు ఇచ్చింది. సాయంత్రం రాగానే చూపించాలి సంతోషిస్తుంది’ అంటూ తిప్పుకుంటూ వెళ్లిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది. ఇక ధాన్యం, రుద్రాణీలు.. సుభాష్, అపర్ణా దేవీల ముందుకు వెళ్లి.. జరిగింది చెప్పి.. " ఈ ఇంట్లో సమాన హక్కు ఎక్కడుంది. మాకు కనీసం తినడానికి కూడా తిండి కూడా లేదు .. అక్కకు పది లక్షలు ఎలా ఇస్తుంది? అని వచ్చాక కచ్చితంగా గట్టిగా అడుగుతా.. మేము ఊరుకోం" అని చెబుతుంది. ఇక సుభాష్‌తో అపర్ణా దేవి.. ‘కావ్య తెలిసి తప్పు చేయదు .. ఏం జరిగి ఉంటుందో.. అప్పుడు మనం మాట్లాడదాం’ అని అంటుంది. సరే అంటాడు సుభాష్. ఇక సీన్ కట్ చేస్తే కావ్య, రాజ్ ఇంటికి రాగానే.. ‘వచ్చావా నీ కోసమే ఎదురు చూస్తున్నాం’ అని అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story