సింగరేణి సంస్థకు కార్మికుల్లే ఆయుధం: జీఎం దుర్గం రామచందర్

by Mahesh |
సింగరేణి సంస్థకు కార్మికుల్లే ఆయుధం: జీఎం దుర్గం రామచందర్
X

దిశ, మణుగూరు: సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లే సింగరేణి సంస్థకు ఆయుధమని, వారి కష్టం- శ్రమ-కృషి-ఐక్యతనే సింగరేణిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని.. మణుగూరు సింగరేణి జీఎం దుర్గం రామచందర్ అన్నారు.బుధవారం సింగరేణి జీఎం కార్యాలయంలో ఎస్ఓటు జీఎం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ… సింగరేణి సంస్థకు కార్మికులే ఆయుధమన్నారు. వారి కష్టం-శ్రమ-కృషి ఐక్యత ద్వారానే సింగరేణిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని నొక్కి చెప్పారు. బొగ్గు ఉత్పత్తి తీయడంలో బొగ్గు రవాణా చేయడంలో మణుగూరు ప్రాంతమే ప్రధమంగా నిలిచిందని చెప్పారు.

జూన్ నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 11 లక్షల 16 వేల 500 టన్నులకు గాను 10 లక్షల 52 వేల 611 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. మొత్తంగా జూన్ నెలలో 94% ఉత్పత్తి చేశామన్నారు.అలాగే 01 ఏప్రిల్ 2024 నుంచి 30 జూన్ 2024 వరకు బొగ్గు ఉత్పత్తి 33 లక్షల 91 వేల 500 టన్నుల లక్ష్యానికి గాను 32 లక్షల 76 వేల 811 టన్నులు సాధించడం జరిగిందన్నారు.మొత్తం మీద 97% శాతం సాధించడం జరిగిందన్నారు.జూన్ నెలలో 10 లక్షల 13వేల 173 టన్నులు రవాణా చేయడం జరిగిందన్నారు. అలాగే 01 ఏప్రిల్ 2024 నుంచి 30 జూన్ 2024 వరకు 31 లక్షల 46 వేల 139 టన్నులు రవాణా చేయడం కూడా జరిగిందని చెప్పారు.జూన్ లో 13లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 79% శాతం అనగా (10 లక్షల 21 వేల) క్యూబిక్ మీటర్ల తీయడం జరిగిందన్నారు.ఫలితంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 34 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల 78% శాతం ఓబీ నుంచి వెలికి తీయడం జరిగిందన్నారు.ప్రతి కార్మికునికి, కార్మికుని యొక్క కుటుంబానికి సింగరేణి సంస్థ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Next Story