రీచార్జ్ ధరల పెంపుపై కేంద్రం జోక్యం చేసుకోదు: అధికారి

by Harish |
రీచార్జ్ ధరల పెంపుపై కేంద్రం జోక్యం చేసుకోదు: అధికారి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తమ రీచార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. పెరిగిన ఈ ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ధరల పెంపుపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు రీచార్జ్ ధరలు కూడా పెంచడం వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో కేంద్రం రీచార్జ్ ధరల పెరుగుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రజలు పేర్కొంటున్న తరుణంలో, మొబైల్ రీచార్జ్ ధరలను పెంచకుండా జోక్యం చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటర్ నిర్ణయించుకున్నాయని ఒక అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టెలికాం టారిఫ్‌ల‌తో పోలిస్తే భారతదేశంలోనే తక్కువగా ఉన్నాయని అన్నారు. అయితే కంపెనీలు ధరలను పెంచడం మాత్రమే కాకుండా దానికి అనుగుణంగా అవి వినియోగదారులకు మెరుగైన నాణ్యత సేవలను అందించాలని, టెలికాం రంగంలో తగినంత పోటీ ఉందని అధికారి తెలిపారు.

ఈ వారం, మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను 11-25 శాతం పెంచడంతో మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను ప్రభావితం చేస్తుంది. నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్‌ల ధరలను పెంచడంతో గృహ ఖర్చులు చాలా వరకు ప్రభావితం అవుతాయి. ధరల పెరుగుదలతో పట్టణ ప్రాంతాల్లో గృహ ఖర్చులు 2024 ఆర్థిక సంవత్సరంలో 2.7 శాతం నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో 2.8 శాతం పెరుగుతుంది. అదే గ్రామీణ కుటుంబాలకు గృహ ఖర్చు 4.5 శాతం నుండి 4.7 శాతానికి పెరుగుతుంది.

Advertisement

Next Story