మొలచింతపల్లి ఈశ్వరమ్మ సంఘటన.. రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బృందం సమీక్ష

by Mahesh |
మొలచింతపల్లి ఈశ్వరమ్మ సంఘటన.. రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బృందం సమీక్ష
X

దిశ, అచ్చంపేట: నగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన మొల చింతపల్లి గ్రామంలో ఆదివాసి చెంచు బిడ్డ ఈశ్వరమ్మ ఘటనతో గత 15 రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా వాడీ వేడీ చర్చ కొనసాగుతుంది. ఈ సంఘటన అనంతరం ఈశ్వరమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం జిల్లా కేంద్రం నుండి హైదరాబాదులో నిమ్స్ ఆస్పత్రికి తరలించి గత నాలుగు రోజుల క్రితం ఈశ్వరమ్మ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నది.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లో సమీక్ష..

ఈశ్వరమ్మ సంఘటనపై శుక్రవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తో పాటు బృందం ఇతర అధికారులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సభావాత్ సంతోష్ ఇతర అధికారులతో శుక్రవారం ఉదయం 10 :30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు చైర్మన్ సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో జిల్లాలో ఉన్న ఆదివాసీలకు ఎంత భూమి ఉంది ? వారికి ప్రభుత్వ సహాయం అందుతుందా ? చెంచుల భూములు ఇతరుల చేతుల్లో అన్యాక్రాంతం అయ్యాయా ? అయితే ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? భూముల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు ఏమిటి ? తదుపరి ఏం చర్యలు తీసుకుంటుంది? ఆదివాసుల సంరక్షణ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటిడిఏ యంత్రాంగం ఏ మేరకు వారి కోసం చర్యలు తీసుకుంది? ఎన్ని నిధులు ఉన్నాయి ? వారి సంక్షేమ కోసం నిధులు ఖర్చు చేసింది ఎంత ? అసలు నిధులు తెచ్చేందుకు ప్రణాళికలు చేశారా.. లేదా అనే విషయంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేసింది. ఆ కేసుల పరిశీలన ఎంతవరకు వచ్చింది. బాధితులకు న్యాయం జరిగిందా ? ఎందుకు నిర్లక్ష్యం అయింది.. ఇలా అనేక విషయాలపై సమగ్రంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

అందుకే అధికారులు పర్యటన జరిగిందా ?

ములచింతపల్లి గ్రామంలో ఈశ్వరమ్మ సంఘటన ఈనెల 11న వెలుగులోకి రావడంతో ఆ గ్రామానికి ఐ టి డి ఏ ఇన్చార్జి పి ఓ, జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి బాధిత గ్రామాన్ని సందర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించే విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆదివాసీ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ బృందం సభ్యులు వస్తున్న సందర్భంగా ముందు రోజు బుధవారం కలెక్టర్ తో పాటు ఐ టీ డి ఏ ఇన్చార్జి పిఓ వెళ్లి ఆదివాసులతో మాట్లాడేందుకు వెళ్లారని లేకపోతే ఆ గ్రామాన్ని ఇంత జరిగినా ఎందుకు సందర్శించలేదని చెంచుల నుండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొలచింతపల్లిలో పర్యటన..

జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో గల మొలచింతలపల్లి ఆదివాసి గూడెం లో చెంచు మహిళా సభ్య సమాజం తలదించుకునేలా ఈశ్వరమ్మ పై ప్రమానుస్యంగా జరిగిన సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తన బృందం ఆ సంఘటనపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఇతర అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మొల చింతపల్లి గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు భూ సమస్య పరిష్కారం సామాజిక రక్షణ తదితర అంశాలపై ఆదివాసీ గిరిజనుల నుంచి అడిగి తెలుసుకోనున్నారు.

Next Story

Most Viewed