రామాయణానికి ముహుర్తం ఫిక్స్..అధికారిక ప్రకటన అప్పుడే!

by Jakkula Samataha |
రామాయణానికి ముహుర్తం ఫిక్స్..అధికారిక ప్రకటన అప్పుడే!
X

దిశ, సినిమా : దర్శకుడు నితీష్ తివారి, భారతీ ఇతిహాసం ఆధారంగా రామాయణం‌ను హిందీలో తెరక్కించడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో, బుల్లితెరపై రామాయణం చిత్రాలు , సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం నీతిష్ వైపే చూస్తుంది.

ఈయన రామాయణాన్ని ఎలా తెరకెక్కించబోతున్నాడు,ఈయన దర్శకత్వంలో వచ్చే ఈ ఇతిహాసంలో ఎలాంటి కొత్తదనం చూపిస్తాడో అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీం అదిరిపోయే న్యూస్ అందించింది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజున ఈ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారట.మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇందులో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీత పాత్రలో న్యాచురల్ స్టార్ సాయి పల్లవి, రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం.

Advertisement

Next Story

Most Viewed