విడాకులకు బ్రేక్.. అలా భర్తకు షాకిచ్చిన నయన్

by Jakkula Samataha |
విడాకులకు బ్రేక్.. అలా భర్తకు షాకిచ్చిన నయన్
X

దిశ, ఫీచర్స్ : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక నటనతో ఎంత ఫేమస్ అయ్యిందో, తన పర్సనల్ విషయాల పట్లకూడా అంతే రేంజ్‌లో ఫేమస్ అయ్యింది నయన్. లవ్ ఫెల్యూర్స్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తర్వాత విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీరి పెళ్లి తర్వాత కూడా నయన తార వార్తల్లో నిలిచి, చాలా సమస్యలను ఎదుర్కొంది. ఇక వీటన్నింటి తర్వాత చాలా సంతోషంగా గడిపిన ఈ జంట, చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నయన తార విఘ్నేష్‌ను అన్ ఫాలో చేయడం,తన కన్నీళ్లతో కూడా ఇది నాకు లభించినదనే అర్థం వచ్చేలా కొటేషన్ షేర్ చేసింది. దీంతో వీరు విడిపోతున్నారంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.

అయితే తాజాగా ఈ వార్తలకు బ్రేక్ పడింది. విఘ్నేష్ తన ఇన్ స్టా సోర్టీలో నయన్ బ్యూటీ బ్రాండ్ 9Skin రాబోయే అవార్డుల కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా ఉంటుందని తెలిపే పోస్టును పంచుకున్నాడు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతోపాటు పూలతో కలిసి ఫోజులిచ్చిన నయన్ ఫోటోను షేర్ చేశాడు. మరోవైపు నయన్ కూడా తన ఇన్ స్టాలో తన భర్తను తిరిగి ఫాలో అవుతుంది. దీంతో వీరిద్దరు విడిపోవడం గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది. అయితే నయన తార అన్ ఫాలో చేసి విఘ్నేష్‌కు షాకిచ్చిందని కొందరు ముచ్చటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed