బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘కల్కి’ కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

by Hamsa |
బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘కల్కి’ కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
X

దిశ, సినిమా: ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కల్కి ‘2898 ఏడి’. ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు స్టార్స్ రివ్యూస్ ఇవ్వడంతో రెస్పాన్స్‌కు ప్రేక్షకుల్లో చూడాలనే ఆసక్తి మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు 100 కోట్ల గ్రాస్‌ను దాటేసి రూ. 191.5 కోట్లు సాధించింది. అలాగే రెండో రోజు రూ. 107 వసూళ్లు రాబట్టింది. తాజాగా, కల్కి మూడో రోజు కలెక్షన్స్ రివీల్ చేస్తూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీ బ్యానర్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

శనివారం కావడంతో ఏకంగా రూ. 116. 5 కోట్లు రాబట్టి రూ. 415 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. అయితే నేడు (జూన్ 30) ఆదివారం కల్కి కలెక్షన్స్ రూ. 500 కోట్లు దాటేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, ఇందులో మృణాల్ ఠాకూర్, దిశా పటాని, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్, మాళవిక నాయర్, వంటి స్టార్ నటించి సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. అయితే కల్కి పార్ట్ -2పై ఇప్పటికే నిర్మాత అశ్వినీ దత్ ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తొందరలోనే విడుదల చేయనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో కల్కి-2 ను చూసేందుకు సినీ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed