థర్డ్ స్టేజ్‌లో ఉన్న నటి.. ట్రీట్మెంట్ స్టార్ట్ (పోస్ట్)

by sudharani |
థర్డ్ స్టేజ్‌లో ఉన్న నటి.. ట్రీట్మెంట్ స్టార్ట్ (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ ఇటీవల క్యాన్సర్ భారీన పడినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘హాయ్.. మీ అందరితో ఓ ఇంపార్టెంట్ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. నాకు బ్రెస్ట్ క్యాన్సర్. ప్రస్తుతం అది మూడో స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటానని ఎంతో ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాను’ అంటూ తన పరిస్థితిని వివరించింది.

ఇక తాజాగా ఆమెకు ట్రీట్మెంట్‌కు సంబంధించి మరో పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మేరకు ‘మొదటి కీమో సెషన్‌తో చికిత్స ప్రారంభించిన హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ నుండి త్వరగా & పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము’ అంటూ ఆమె ట్వీట్మెంట్ తీసుకుంటున్న పలు ఫొటోలు షేర్ చేసింది బాలీవుడ్ మీడియా. ప్రజెంట్ ఇవి నెట్టింట వైరల్ కావడంతో.. త్వరగా కోలుకోవాలంటూ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు.

కాగా.. హీనా ఖాన్ ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ అనే సిరీయల్ ద్వారా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ తెలుగులో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ పేరుతో డబ్ చేయబడింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ‘నాగిన్ సీజన్ 5’లో నటించింది. అంతే కాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో కూడా యాక్ట్ చేసి నటిగా రాణించింది.

Next Story

Most Viewed