మీ చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటా.. నటుడు షాకింగ్ పోస్ట్

by sudharani |
మీ చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకుంటా.. నటుడు షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: ఇప్పుడు ఎక్కడ విన్నా ‘కల్కి’ పేరే వినిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్దా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. నాలుగు రోజుల్లోనే రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇవి రూ. 1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఇక ‘కల్కి’ సినమా సక్సెస్‌ను ఫ్యాన్స్‌తో పాటు.. సెలబ్రెటీలు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరో, హీరోయిన్లు తమ రివ్యూలు ఇవ్వగా.. తాజాగా నటుడు బ్రహ్మాజి తనదైన కామెడీ టైమింగ్‌తో మూవీ టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఈ మేరకు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇంత దూరం వచ్చేందుకు చాలా కష్టపడ్డా అనే అర్థం వచ్చేలా తన అరిగిపోయిన చెప్పులు స్టేటస్ పెట్టిన విషయం తెలిసిందే. దానికి సింక్ అయ్యేలా ‘తెలుగు సినిమా అనుకొంటే world సినిమా తీశారు. @nagashwin7 మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను. థాంక్యూ ప్రియాంక.. స్వప్న.. మీ రిస్కులే మీకు శ్రీరామ రక్ష’ అంటూ X ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed