Sai Pallavi: వారిద్దరే నాకు బెస్ట్ అంటున్న సాయి పల్లవి

by S Gopi |   ( Updated:2022-06-30 13:34:00.0  )
Sai Pallavi Best Friends in Tollywood Rana and Naga Chaitanya
X

దిశ, సినిమా : Sai Pallavi Best Friends in Tollywood Rana and Naga Chaitanya| టాలీవుడ్‌లో లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవికి యూత్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక రీసెంట్‌గా విడుదలైన 'విరాట పర్వం' మూవీ సక్సెస్‌‌తో ఆ క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమలో పరిచయాలు, స్నేహాలు చాలా కామన్ అయినప్పటికీ.. ఈ విషయంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని తెలసిందే. లేదంటే లేనిపోని రూమర్స్ సృష్టించి కథనాలు అల్లేయడం మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే సాయిపల్లవి టాలీవుడ్‌లో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పేసేంది. తన విషయంలో వాళ్లే కేర్ తీసుకుంటారని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వాళ్లెవరో కాదు.. టాలీవుడ్ హంక్ రానా, అక్కినేని నాగ చైతన్య. వారిద్దరూ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఏ విషయంలో అయినా వారి సాయం తీసుకుంటానని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed