- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ వడ్లు మొత్తం మేమే కోంటాం.. మంత్రి హరీష్ రావ్ ప్రకటన..
దిశ, సిద్దిపేట: నల్ల చట్టాల రద్దు రైతుల విజయం అని, ఏడాది రైతుల పోరాటం తో కేంద్రం దిగొచ్చిందనీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలోనీ చిన్నకోడూర్ , పెద్ద కోడూర్ , రాముని పట్ల గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొంటారా..? కొనరా..? చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని ప్రశ్నించారు. మాది రైతు ప్రభుత్వం అని, అందుకే రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా లో పాల్గొన్నారని తెలిపారు. వాన కాలం పంట మొత్తం తెలంగాణ ప్రభుత్వం కొంటుందనీ, వడ్లు కొనేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా.. వానాకాలం పంట ను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందనీ పేర్కొన్నారు. వర్షాల వల్ల , తుఫాను వల్ల , వడ్లు ఎండక పోవడం వల్ల ధాన్యం కొనడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. వడ్లు కొన్న డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో రైతుల ఖాతాలకు జమ చేస్తే.. కేంద్రం ఏడాది తర్వాత డబ్బులు ఇస్తోందని తెలిపారు. వ్యవసాయ శాఖ నుండి రైతుల కోసం 30వేల కోట్లు ఖర్చు చేస్తున్నామనీ, వాటికి మిత్తి 1000 కోట్లు భరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మిత్తి , హామాలి , గోడౌన్ ల కిరాయి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.