- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాడీ పాజిటివిటీ మేలు చేస్తుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
దిశ, ఫీచర్స్ : మీరు హ్యాపీగా ఉండాలంటే మీ శరీరాన్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి అంటుంటారు కొందరు. నిజానికి ఈ రోజుల్లో బాడీ పాజిటివిటీ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్‌గా మారుతోంది. చాలామంది తమ సంభాషణల్లో ఒక్కసారైనా దీనిగురించి ఆలోచించడమో, ప్రస్తావించడమో చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా మొదలుకొని టీవీల్లో కమర్షియల్ యాడ్స్ వరకు, మానవ శరీరానికి సంబంధించిన ఇన్ క్లూజివ్ ఇమేజింగ్ ప్రదర్శనే అధికంగా కనిపిస్తుంది. దీంతో శరీర ఆకృతిపై ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ నెలకొంటుంది. అయితే ఓన్ బాడీ గురించి సానుకూల దృక్పథం ఎక్కువైనప్పుడు పలు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పాజిటివిటీతో చాలామంది తమ శరీరం గురించి అనేక భ్రమలను కూడా కలిగి ఉంటారు. సన్నగా, నాజూగ్గా ఉన్నవారు ‘ఇక మాకేం పర్వాలేదు. బాగానే ఉన్నాం’ అనుకుంటారు. జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తారు. ఆహార నియమాలను, వ్యాయామాలను వదిలేస్తారు. దీంతో కొంత కాలానికి వారికి తెలియకుండానే బాడీ ఇమేజింగ్ మారిపోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఇక పిల్లల విషయానికి బాడీ పాజిటివిటీ కొన్నిసార్లు వారిని సమస్యల్లోకి నెడుతోంది. ఎలాగంటే.. చిన్నప్పుడు లావుగా ఉండటం కూడా అందంగానే అనిపిస్తుంది. దీంతో పేరెంట్స్ బొద్దుగా, ముద్దుగా ఉన్నారంటూ గారాబం చేస్తుంటారు. పోషకాలు, కేలరీలతో సంబంధం లేకుండా అన్ని రకాల ఆహారాలు పిల్లలకు తినిపిస్తుంటారు. వారు కోరిన పదార్థాలన్నీ సమకూరుస్తుంటారు. ఇక్కడ తమ పిల్లల బాడీ ఇమేజింగ్ పేరెంట్స్‌లో ఉన్న పాజిటివ్ దృక్పథంవల్ల కొంతకాలానికి మరో రకంగా మారుతుంది. చిల్ట్రన్స్‌లో అధిక బరువు, ఇతర శారీరక మార్పలు సంభవించే చాన్స్ ఉంటుంది. యువతీ యువకుల్లో బాడీపాజిటివిటీ ఎత్తు, బరువు, శరీర ఆకృతి వంటి అంశాలను ప్రభావితం చేస్తోంది. పిల్లల శరీరాకృతిపై సానుకూల భావన అధికం కావడంవల్ల 2 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో 20 శాతం మంది ఒబేసిటీని డెవలప్ చేసినట్లు ఇటీవల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 15 మిలియన్లమంది బాడీ పాజిటివిటీతోనే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుటుంబంలో తొలుసరి సంతానంపట్ల బాడీపాటివిటీ ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీంతో వరల్డ్ వైడ్‌గా 2 నుంచి ఐదేళ్లలోపు పిల్లల్లో 12.7 శాతం, 12 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సుగల పిల్లల్లో 22.2 శాతం ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. అందుకే బాడీపాజిటివిటీ ఓవర్ కాకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.