- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కడ రోజూ డైమండ్ వర్షం కురుస్తుంది.. ఈ విషయం తెలియగానే..
దిశ, ఫీచర్స్ : వడగండ్లవాన కురుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వజ్రాల వాన కూడా కురుస్తుందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. భూమిపై కాదు కానీ.. అంతరిక్షంలో ఈ అద్భుతం జరుగుతుంది. యురేనస్, నెప్ట్యూన్‌తోపాటు మరికొన్ని గ్రహాలపై డైమండ్ వర్షం కురుస్తుందని కాలిఫోర్నియాలోని SLAC నేషనల్ యాక్సిలరేటర్ లాబొరేటరీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి చాలా ప్రయోగాలు డైనమిక్ కంప్రెషన్ మెథడ్స్‌పై ఆధారపడి ఉంటాయి. అయితే రీసెర్చర్స్ ఈ విషయం తెలుసుకోవడానికి స్టాటిక్ కంప్రెషన్ మెథడ్ బేసిస్‌గా ఫీల్డ్‌లో ప్రయోగం చేయడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా తక్కువ ఉష్ణోగ్రతలవద్ద కొన్ని ఎక్సోప్లానెట్స్‌పై కోర్ లోపల సంపీడన (extremely compressed) కార్బన్ సమ్మేళనాల ఫలితంగా డైమండ్స్ వర్షం కురుస్తుందని గుర్తించారు. పరిశోధకుడు ముంగో ఫ్రాస్ట్ అండ్ అతని టీమ్ ప్రకారం.. యురేనస్ అండ్ నెప్ట్యూన్ వంటి ఐస్-జెయింట్ గ్రహాల లోపల డైమండ్ వర్షం కురవడం ఒక సాధారణ ప్రక్రియగా ఉంటోంది.
భూమికి ఆవల మంచుతో నిండిన గ్రహాలపై కంప్రెస్డ్ కార్బన్ పరిస్థితులను గుర్తించేందుకు పరిశోధకులు ముందుగా స్టాటిక్ కంప్రెషన్ డైనమిక్ హీటింగ్‌ను ఉపయోగించారు. ‘కంప్రెషన్’.. అంటే రీసెర్చర్స్ పాలీస్టైరిన్, స్టైరోఫోమ్‌ను తయారు చేయడానికి ఉపయోగించే పాలిమర్. అయితే వారు రెండు వజ్రాల మధ్య పాలీస్టైరిన్‌ను స్క్వీజ్ చేసిన తర్వాత దానిని ఎక్స్-రే లైట్ యొక్క పల్స్ రేట్ పెరగడం, పేలడం, ఆ తర్వాత వజ్రాలు కురవడం వంటి పరిణామాలు సంభవించడం ఆశ్చర్యానికి గురిచేసింది. 2200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పాలీస్టైరిన్ నుంచి క్రమంగా డైమండ్స్ ఏర్పడుతున్నాయని కనుగొన్న పరిశోధకులు కనుగొన్నారు. అలాగే 19 గిగాపాస్కల్స్ చుట్టూ ఉన్న పీడనాలు కారణంగా యురేనస్ అండ్ నెప్ట్యూన్ లోపలి భాగాలలో కూడా పరిస్థితులు ఉన్నాయని, ఆ గ్రహాలపై డైమండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని నిర్ధారించారు. ధ్రువీకరించిన మొత్తం 5600 ఎక్సోప్లానెట్‌లలో, సుమారు 1900 కంటే ఎక్కువ గ్రహాలలో వజ్రాల వర్షం కురుస్తుందని పరిశోధకులు తెలిపారు.