- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టర్కీస్ పర్వతాల్లో అరుదైన జంతువులు.. 3 మిలియన్ సంవత్సరాలుగా జీవించి ఉన్నాయట !
దిశ, ఫీచర్స్ : సైంటిస్టులు టర్కీ పర్వతాలలో మూడు మిలియన్ సంవత్సరాలుగా జీవించి ఉన్న చాలా అరుదైన రెండు ‘లివింగ్ మోల్’ జంతువులను గుర్తించారు. నిజానికి ఇవి భూగర్భంలో నివసించే ఏకైక చిన్న క్షీరదాలు. వీటి లాటిన్ పేరు తల్పా యూరోపియాగా పిలుస్తారు. తల్పా హక్కరియెన్సిస్ అండ్ తల్పా డేవిడియానా అనే జాతులు కూడా ఉంటాయి. ఇతర క్షీరదాలతో పోలిస్తే ఇవి తమ శరీరంలో ఎర్ర రక్త కణాలను పెద్ద సంఖ్యలో కలిగి ఉంటాయి. అందుకే 100 శాతం భూగర్భంలో జీవించగల శారీరక పరిస్థితిని కలిగి ఉంటాయి. మానవులు జీవించి ఉండటానికి కనీసం 21 శాతం ఆక్సిజన్ లెవల్స్ అవసరం. కానీ తల్పా యూరోపియన్ లేదా మోల్ జంతువులు జీవించడానికి కేవలం 7 శాతం ఆక్సిజన్ లెవల్స్ ఉంటే సరిపోతుందట. ఇవి సాధారణంగా పశ్చిమ ఆసియా, ఐరోపాలో కనిపించే భూగర్భ, అకశేరుక-ఈటింగ్ మమ్మల్స్ యొక్క సుపరిచితమైన సమూహంలో భాగం.
కొత్త జీవ జాతుల అన్వేషణలో భాగంగా ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్ యూనివర్సిటీ, టర్కీలోని ఒండోకుజ్ మేయిస్ యూనివర్సిటీ అండ్ ఇండియానా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు టర్కీలో కనుగొన్న న్యూ ‘మోల్స్’ గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇవి శీతాకాలంలో 6 అడుగుల మంచు పొరల లోతుల్లో, వేసవిలో అయితే 122 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతల కింద కూడా జీవించి ఉటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 6,500 క్షీరద జాతులు మాత్రమే ఇప్పటి వరకు గుర్తించబడ్డాయని, అయితే టర్కీ పర్వతాల్లో కనుగొన్న ‘మోల్’ మిగతా వాటికంటే భిన్నమైందని, ప్లైమౌత్ యూనివర్సిటీ ఆక్వాటిక్ బయాలజీ ప్రొఫెసర్ డేవిడ్ బిల్టన్ షా పేర్కొన్నాడు. ఇతర జాతుల ‘లివింగ్ మోల్స్’తో తల్పా యూరోపియాలను పోల్చడానికి అత్యాధునిక డీఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసిన సైంటిస్టులు టర్కిష్ జీవులు బయాలజికల్‌గా డిఫరెంట్ భౌతిక లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి జీవవైవిధ్య స్వభావాన్ని తక్కువ అంచనా వేయలేమని, ప్రకృతిలో ఇంకా కనుగొనబడని జీవజాతులు కూడా ఉండవచ్చునని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Read More: అంతరించిపోతున్న ఆఫ్రికన్ పెంగ్విన్‌లు.. క్రాష్ అవుతున్న సార్డినెస్ ఫిషెస్