- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ మీడియా ముఖ్యమే కానీ.. అలర్ట్‌గా లేకపోతే జరిగేది అదే !
దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ సోషల్ మీడియా మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వేదికగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వేదికలో లేదా యాప్‌లో తప్పకుండా ఎకౌంట్ కలిగి ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ జ్ఞానమంతా ఇప్పుడు అక్కడే ప్రత్యక్షం అవుతోంది. అలాగని సోషల్ మీడియానే సర్వస్వం అనుకోవడం కూడా పొరపాటే. విజ్ఞానం, అజ్ఞానం, వాస్తవాలు, అవాస్తవాలు, ఆసక్తులు, అనాసక్తులు అన్నీ ఇక్కడ ప్రదర్శితం అవుతుంటాయి. కాబట్టి సోషల్ మీడియాను యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
అయితే ఈ మధ్య పలువురు ఓన్లీ పర్సనల్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ పర్పస్‌గా సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో అదొక వ్యసనంగానూ మారుతోందని, కొందరిపై దుష్ప్రభావం చూపుతోందని జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 14 ఏండ్లలోపు యువతీ యువకులు ఎక్కువ సమయం స్క్రోల్ చేయడంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు విషయాల్లో ఇతరులతో పోల్చుకోవడం, తమ బాడీ ఇమేజింగ్ నాజూగ్గా లేదనే ఫీలింగ్స్‌తో ఆత్మన్యూనతా భావాలకు గురవుతున్నారు.
ఐదు నుంచి పదేండ్లలోపు వారు యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ సైట్లలో తరచూ హారర్ గేమింగ్ వీడియోస్ చూడటంవల్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వాటి ప్రభావం కారణంగా పిల్లలో హైపర్ యాక్టివిటీస్, హింసా ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేవలం అవసరం మేరకు మాత్రమే సోషల్ మీడియాను యూజ్ చేసేలా పేరెంట్స్ పిల్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలు కూడా ప్రతిరోజూ గ్యాప్ ఇవ్వకుండా ఎక్కువ సమయం స్క్రోల్ చేస్తున్నారంటే అదొక వ్యసనంగా మారే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. తప్పక సోషల్ మీడియాను యూజ్ చేసేవారు ప్రతి 30 నిమిషాల తర్వాత ఒక గంట బ్రేక్ ఇవ్వడంవల్ల వ్యసనానికి దారితీయకుండా ఉంటుందని చెప్తున్నారు.