- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Life Learnings : సక్సెస్ సాధించాలా ?.. అయితే ఇవి పాటించాల్సిందే ..
దిశ, ఫీచర్స్ : కొన్ని సందర్భాల్లో మీకు ఏం తోచకపోవచ్చు. ఏ విషయంలో ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తే హ్యాపీగా ఫీలవుతారు. ఓటమికి గురిచేస్తే కాసేపు బాధపడతారు. మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడతారు. సక్సెస్ అయిన వారు తమ విజయానికిగల కారణాలను గుణపాఠాలుగా తీసుకొని మరో అడుగు ముందుకు వేయాలనుకుంటారు. ఓటమి పాలైన వారు కూడా గుణపాఠాలే నేర్చుకుంటారు. తామెందుకు సక్సెస్ సాధించలేకపోయామని ఆలోచించే క్రమమే ‘లైఫ్ లెర్నింగ్’ మెథడ్ అంటున్నారు నిపుణులు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటూ.. అధిగమిస్తూ దూసుకుపోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన కొన్ని ‘లైఫ్ లెర్నింగ్స్’ ఉన్నాయి. వాటిని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
జీవితమన్నాక సమస్యలు, సవాళ్లు కామన్. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తే మీకు గుణపాఠం నేర్పుతుంది. విజయం వైపు నడుస్తారు. ఇదే లైఫ్ లెర్నింగ్. అలా కాకుండా ప్రతి విషయంలో భయపడుతూ వెనుకడుగు వేస్తే ఎప్పటికీ మీ గోల్ నెరవేరదు. పైగా సవాళ్లకు భయపడేవారి శ్రమ వృథా అవుతుందట. అందుకే చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ఎక్కడైనా ఏ సమస్య ఎదురైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ లెర్నింగ్ స్విచ్యుయేషన్స్ మిమ్మల్ని గట్టెక్కిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
సమయం వృథా చేయకండి
‘వేర్ ఈజ్ ద టైమ్ గోస్.. దేర్ ఈజ్ ద ఫ్యూచర్ కమ్స్’ అంటుంటారు నిపుణులు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. జీవితంలో ప్రతీ క్షణం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయి కావచ్చు. మీ కెరియర్ ఏదైనా కావచ్చు. అక్కడ మీరు చేయాల్సి ముఖ్యమైన పని ఏంటంటే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే. ఏ సమయంలో ఏం చేయాలో అది చేయండి. తర్వాత చూద్దాం.. చేద్దాం అంటే పరిస్థితి చేయిదాటి పోవచ్చు. టైమ్ మేనేజ్ మెంట్‌ఫాలో అయిన వారు జీవితంలో ఓడిపోయిన సందర్భాలు చాలా అరుదు. కాబట్టి మీరు నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏ పనులు ఎప్పుడు చేయాలనే విషయంలో ఒక క్లారిటీతో ఉండాలి. అంతేకానీ ఒక సమయం ఫిక్స్ చేసుకొని మరో సమయంలో పనులు మొదలు పెట్టడం తరచుగా జరిగితే ఓటమి తప్పదు.
రియలిస్టిక్ స్టెప్స్
ఏ విషయంలోనైనా వాస్తవంగా ఆలోచించాలి. కేవల అంచనాలు, భ్రమలతో ఉంటే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. రిలేషన్ షిప్‌లో, ఫ్రెండ్ షిప్‌లో, జీవితంలో ఎక్కడైనా, ఏ సందర్భమైనా కావచ్చు. అడుగు ముందుకు వేసే ముందు వాస్తవమేంటి? సరైన నిర్ణయమే తీసుకున్నారా? అనేది ఒక్కక్షణం ఆలోచిస్తే చాలు ఈ లైఫ్ లెర్నింగ్ స్విచ్యువేషన్ మిమ్మల్ని గొప్ప మార్గంలో నడిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా అన్ రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో, సాధ్యంకాని అతి ఆలోచనలతో అడుగు ముందుకు వేస్తే అసలు ప్రాబ్లమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి. దీనివల్ల మీ వ్యక్తిగత, సామాజిక సంబంధాలు దెబ్బతినవచ్చు. వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తే చదువు, కెరీర్, ఉద్యోగం ఎందులోనూ సక్సెస్ ఉండదు.
సెల్ఫ్-కాన్సియస్‌నెస్
లైఫ్ టెర్నింగ్స్‌లో సెల్ఫ్ కాన్సియస్‌నెస్‌కు చాలా ప్రయారిటీ ఉంటుంది. కొన్నిసార్లు రోజువారీ పనులు మిమ్మల్ని నిరాశకు గురిచేయవచ్చు. మరికొన్నిసార్లు సంతోషం కలిగించవచ్చు. ఇదొక భాగం. అయితే అంతకుముందు మీరు ఏ పని చేయాలో నిర్ణయించుకోవడం బెటర్. ఎందుకంటే కొన్నిపనులు మీకు నచ్చనివి అయి ఉండవచ్చు. వాటిని బలవంతంగా చేస్తూ సమయాన్ని కోల్పోకండి. స్వీయ స్పృహతో నిర్ణయాలు తీసుకోండి. అవే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాగని ఇతరులపై ఎక్కువ ఫోకస్ చేస్తూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం కూడా సరికాదని గుర్తుంచుకోండి. నిరంతరం నేర్చుకోవడం, అబ్జర్వ్ చేయడం కొనసాగించండి. లైఫ్ లెర్నింగ్ అసలు ఉద్దేశం కూడా ఇదే. మీరు ఈ ప్రపంచాన్ని చదవడంలో, గ్రహించడంలో, సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో, సమస్యలను అధిగమించడంలో నిత్య విద్యార్థిగా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు.