- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చలికాలంలోనే ఎక్కుమంది స్త్రీలు గర్భం దాల్చుతారు.. కారణం ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : చలికాలంలో కూల్ వెదర్‌వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ తలెత్తడం మినహా చాలా విషయాల్లో దీనికో ప్రత్యేకత ఉంది. విహార యాత్రలకు, శుభకార్యాలకు అనువైన కాలంగా భావిస్తారు. వివిధ ఫెస్టివల్స్ కూడా వింటర్‌లోనే అధికంగా ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. మన దేశంలో మహిళలు ఎక్కువగా చలికాలంలోనే గర్భం దాల్చడం, పిల్లలకు జన్మనివ్వడం జరుగుతూ ఉంటుందని జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలోనే స్త్రీలలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవడం వెనుక జీవ సంబంధమైన రీజన్స్ ఉన్నాయంటున్నారు గైనకాలజిస్టులు.
సాధారణంగా చలికాలంలో స్త్రీ, పురుషుల్లో లైంగికపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట. ఈ సీజన్‌లోనే పురుషుల్లో ఉన్నదానికంటే స్పెర్మ్ కౌంట్ 5 నుంచి 10 శాతం పెరుగుతుందని ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. పైగా పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. స్త్రీలలో కూడా సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫలితంగా భార్య భర్తల్లో లైంగిక పరమైన కలయికలు ఎక్కువసార్లు జరుగుతాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల చలికాలంలో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని, మహిళల్లో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని గైనకాలజిస్టులు చెప్తున్నారు.