- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రపంచంలోనే అందమైన పర్యాటక ప్రాంతాలు.. కానీ ప్రమాదకరం !
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని ప్రకృతి సౌందర్యాలను, టూరిస్టు స్పాట్లను ఒక్కసారైనా చూస్తే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ప్రదేశాలు, వింతలు చూడటం మనలో క్యూరియాసిటీని, హ్యాపినెస్‌ను పెంచుతాయి. అందుకే పర్యాటక ప్రదేశాలకు, పర్యాటక రంగానికి ప్రయారిటీ పెరుగుతోంది. కొన్ని దేశాలైతే కేవలం పర్యాటకరంగంపై ఆధారపడి మాత్రమే డెవలప్ అవుతుంటాయి. దీనినిబట్టి టూరిస్టు సెక్టార్ ఎంత ప్రాధాన్యతగలదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రదేశాలు వాటిభౌగోళిక, వాతావరణ పరిస్థితుల రీత్యా ఆకట్టుకుంటే, మరికొన్ని వాటి చారిత్రాత్మక నేపథ్యం, ఆకారం, అక్కడికి వెళ్లి చూడటంలో కలిగే అనందాన్ని, అనుభూతిని బట్టి ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటిలో కొన్ని మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్స్ అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లడం రిస్క్ అని తెలిసినా సాహస యాత్రికులు చూసేందుకు వెళ్తూనే ఉంటారు. అటువంటి అద్భుతమైన, అందమైన స్పాట్స్ ఏవో తెలుసుకుందాం.
దర్వాజా గ్యాస్ క్రేటర్.. తుర్క్మెనిస్తాన్, డెత్ వ్యాలీ
దర్వాజా గ్యాస్ క్రేటర్ అనే పర్యాటక ప్రదేశం తుర్క్మెనిస్తాన్‌లో ఉంది. దీనిని ‘గేట్స్ ఆఫ్ హెల్’ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఇదొక మండుతున్న గొయ్యి. 1970లలో చమురు కోసం ఒక గుహలోకి డ్రిల్ చేయడంతో ఇది ఏర్పడింది. దీనివల్ల అందులోని నాచురల్ గ్యాస్ క్షేత్రం కూలిపోయింది. విషపూరిత వాయువును కాల్చడానికి దానిని అప్పట్లో యూజ్ చేశారు. దశాబ్దాల తరువాత కూడా అది ఇప్పటికీ కరకుమ్ ఎడారిలో మండుతూనే ఉంది. కాకపోతే దీనిని చూడటానికి టూరిస్టులు వెళ్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్త వహించిన దానివల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇక మరొక ప్రమాదకర లోయపేరు డెత్ వ్యాలీ. యూఎస్, కాలిఫోర్నియాలోని ఈ డెత్ వ్యాలీ ఇసుక దిబ్బలు, రాక్ సాల్ట్ శిఖరాలు, అలాగే రాక్ ఫ్లాట్‌ల అద్భుతమైన దృశ్యం కారణంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. అయినప్పటికీ, 130°F (54.4°C) రికార్డు ఉష్ణోగ్రతతో దాని విపరీతమైన వేడి ప్రాణాంతకంగా ఉంటుంది.
విల్లారికా, చిలీ, మౌంట్ హుషాన్, చైనా
సాహస యాత్రికులకు ప్రసిద్ధ ప్రదేశం విల్లారికా చిలీ.. ఇది దక్షిణ అమెరికాలోని మోస్ట్ యాక్టివ్ అగ్నిపర్వతాలలో ఒకటి. ఇది చివరిగా 2015లో విస్ఫోటనం చెందింది. అప్పట్లో దీని నుంచి గాలిలో 3,300 అడుగుల (1,000 మీ) వరకు బూడిద, లావాను వెదజల్లింది. ఇక చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ హుషాన్ పర్వతం కూడా ఆకర్షణీయతోపాటు ప్రమాకరమైనది. ఈ పర్వతం దాని పవిత్రమైన ఐదు శిఖరాలు, అలాగే తావోయిస్ట్ దేవాలయాల కారణంగా చాలా కాలంగా ప్రసిద్ధి చెందిన తీర్థయాత్రగా ఉంది. పర్వతం చుట్టూ పాములతో నిటారుగా ఉండే, ప్రమాదకరమైన మార్గాల నెట్‌వర్క్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా ప్రమాదకరమైన ప్రదేశమే అయినా ఆకర్షణీయమైనది.
కరిజిని నేషనల్ పార్క్, ఆస్ట్రేలియా , స్కెల్లిగ్ మైఖేల్, ఐర్లాండ్
ఎర్రటి గోర్జెస్ అండ్ పచ్చని కొలనులతో నిండిన ఈ అడవి భూ భాగం ఒక బ్యూటిఫుల్ ఆస్ట్రేలియన్ నేషనల్ పార్క్. అయితే పశ్చిమ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతంలో ఉన్నది. ఎప్పుడూ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, రాక్‌ఫాల్స్‌కు గురవుతుంది కాబట్టి తరచూ మరణాలు కూడా సంభవిస్తుంటాయి. అలాగే ఐర్లాండ్‌లో అక్కడి వెళ్లడమే ప్రమాదకరమైందిగా భావించే ప్రదేశం ఒకటి కెర్రీ కౌంటీ తీరంలో ఉంది. ఈ క్రాగీ ఐల్ ఒకప్పుడు సన్యాసులకు నిలయంగా ఉండేది. అప్పటి నుంచి ఇది ‘స్టార్ వార్స్ VII: ది ఫోర్స్ అవేకెన్స్’ (2015) చిత్రీకరణ ప్రదేశంగా ఉపయోగించబడింది.
ఎల్ కామినిటో డెల్ రే, ఎవరెస్ట్ పర్వతం, నేపాల్
ఇక స్పెయిన్‌లోని ఎల్ కామినిటో డెల్ రే 1901 నుంచి 1905 మధ్యకాలంలో వస్తువులను మోసుకెళ్లే కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కోసం నిర్మించబడన ప్రాంతం. అయితే ఇది ప్రమాదకర మార్గం కావడంవల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్రినలిన్ జంకీస్‌ను ఆకర్షిస్తుంది. అనేక మంది హైకర్స్ అక్కడ మృత్యువాత పడటంతో అక్కడికి వెళ్లడానికి కొన్ని పరిమితులు విధించబడ్డాయి. అయినప్పటికీ టూరిస్టులు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే అప్పటి పోల్చితే ఇప్పుడు కాస్త సురక్షితమైనదే. ఇక మరొక పర్యాటక ప్రదేశం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా ప్రసిద్ధి చెందిన ఎవరెస్ట్ నేపాల్‌లో ఉంది. ఇది 29,000 అడుగుల (8,850 మీ) ఎత్తులో ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 1,200 మంది అధిరోహకులను ఆకర్షిస్తుంది. అయినప్పటికీ దాదాపు సగం మంది మాత్రమే శిఖరాన్ని చేరుకుంటారు. మరికొందరు ప్రయత్నిస్తూ మరణిస్తారు. ఎవరెస్ట్‌పై మరణానికి ప్రధాన కారణాలు సబ్‌ఫ్రీజింగ్ ఉష్ణోగ్రతలు, అలాగే లోతైన, ఎత్తైన ఎగుడు దిగుడు ప్రదేశాలు. ఇక్కడికి వెళ్లిన పర్వాతారోహకుల్లో 2019లో 11 మంది చనిపోయారు.
డెవిల్స్ పూల్, విక్టోరియా ఫాల్స్, క్లిఫ్స్ ఆఫ్ మోహెర్
సంవత్సరం మొత్తంలో పొడిగా వాతావరణం కలిగి ఉండే ప్రాంతంగా డెవల్స్ పూల్ గుర్తింపు పొందింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఈ విక్టోరియా జలపాతం అంచున ఉన్న ఆల్లిమేట్ ఇన్ఫినిటీ పూల్ ప్రమాదకరమైన టూరిస్టు స్పాట్. ఈతగాళ్ళు కూడా ఇక్కడికి వెళ్లడానికి భయపడుతుంటారు. అయినా పర్యాటకులు చూడటానికి వెళ్తుంటారు. దీంతోపాటు కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్ పైన ఉన్న యూఎస్‌ఏ హాఫ్ డోమ్ అనే ప్రాంతం 14-మైళ్ల (22.5-కిమీ) రౌండ్ ట్రిప్ హైకర్లను అరణ్యంలోకి తీసుకువెళుతుంది. ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతక పరిస్థితులకు కూడా ప్రసిద్ధి చెందింది. 2019లో 500 అడుగులలోతుకు(150 మీ) పడిపోయిన తర్వాత ఒక హైకర్ (hiker) మరణించాడు. ఇక ఐర్లాండ్‌లోని అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాలలో ఒకటి క్లిఫ్స్ ఆఫ్ మోహెర్ ఐర్లాండ్ ఒకటి. దీని అద్భుతమైన నాటకీయ దృశ్యాలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి. ఇది ఐదు మైళ్ల పొడవు (8 కి. మీ)కలిగి ఉంది. ఇది 700 అడుగుల (210 మీ కంటే ఎక్కువ) ఎత్తు వరకు ఉంది. 1990ల ప్రారంభం నుంచి ఇక్కడ 30కి పైగా ప్రమాదవశాత్తు మరణాలు సంభవించాయి.
అనక్ క్రకటౌ, మోంట్ బ్లాంక్ పర్వతాలు
ఇండోనేషియాలోని అనక్ క్రకటౌ అనే వోల్కానిక్ ఐస్‌లాండ్‌లో 1883లో 36,000 మంది మరణించారు. అప్పటి నుంచి చరిత్రలో అత్యంత ఘోరమైన విస్ఫోటనాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 2018లో ఒక ఘోరమైన సునామీ అనక్ క్రకటౌను ఆక్రమించింది. 2020లో విస్ఫోటనాలు కూడా నివేదించబడ్డాయి. ఐరోపాలో ఎత్తైన మరో పర్వతం మోంట్ బ్లాంక్ 15,780 అడుగుల (4,800 మీ కంటే ఎక్కువ) ఎత్తు ఉంటుంది. సంవత్సరానికి 30,000 మంది సందర్శకులతో అలరారే ఈ పర్యాటక పర్వతం ఐరోపాలోని అత్యంత ఘోరమైన పర్వతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాగే ఇది ప్రమాదకరమైన భూభాగంగా ప్రసిద్ధి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడే ప్రాణాంతకమైన క్లైంబింగ్ యాక్సిడెంట్లకు నిలయంగా మారింది.
రీయూనియన్, కొలరాడే నది
రీయూనియన్ అనేది హిందూ మహాసముద్రంలో ఉన్న ఫ్రాన్స్ యొక్క విదేశీ విభాగం, కాగా ఈ ప్రాంతం రీయూనియన్ సున్నితమైన, అసాధారణమైన రద్దీ లేని బీచ్‌లను కలిగి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఇది ప్రపంచంలోనే అత్యంత షార్క్-ఇన్ ఫెస్టెడ్ స్పాట్‌లలో ఒకటిగా పేరుగాంచింది. 2011 నుంచి 2019 మధ్య ఈ ద్వీపంలో 24 దాడులు జరుగగా 11 మరణాలు నమోదయ్యాయి. అలాగే యూఎస్‌ఏ కొలరాడో నది ఐదు రాష్ట్రాల గుండా వెళ్తుంది. 1,450-మైళ్ల పొడవు (2,330 కి.మీ కంటే ఎక్కువ)గల కొలరాడో నది విహారయాత్రలకు ప్రసిద్ధి చెందిన స్విమ్మింగ్ స్పాట్. అయితే ముఖ్యంగా భారీ వర్షాలు, మంచు కరగడం పెరగడాన్ని ప్రజలు పట్టించుకోకుండా ఉంటున్న సందర్భాల్లో స్రమాదాలు సంభవిస్తున్నాయి. వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల కారణంగా 2014 సంవత్సరంలో ఏడు నెలల కాలంలో 15 మరణాలు సంభవించాయి.
ఫాగ్రడాల్స్‌జల్ అండ్ ఐస్లాండ్, కిలౌయా
రేక్జానెస్ ద్వీపకల్పంలోని ఒక ప్రదేశంలో ఏర్పడిన యాక్టివ్ వోల్కానిక్ అగ్నిపర్వతం ఇది. 1,640 అడుగుల పొడవు (500 మీ) ద్వారం లాంటి భాగాన్ని కలిగి ఉంది. ఇక్కడికి చేరుకోవడం కష్టంగా ఉంటుంది. పైగా విష వాయువులు, విస్ఫోటనాలు వెదజల్లుతుంటాయి. అయినా సందర్శకులు దూరం నుంచి అయినా చూసేందుకు వెళ్తుంటారు. నార్వేలోని మరో టూరిస్టు స్పాట్ అండ్ డేంజరస్ ప్లేస్ ట్రోల్‌టుంగా ఈ ఆకట్టుకునే రాక్ ఫార్మేషన్ సెల్ఫీ-టేకింగ్ హైకర్లకు ఫేమస్ స్పాట్. సముద్ర మట్టానికి దాదాపు 3,600 అడుగుల (దాదాపు 1,100 మీ) ఎత్తులో ఉంటుంది. హైకర్లు దురదృష్టవశాత్తు హైపడి మరణించిన సంఘటనలు కోకొల్లలు. బిగ్ ఐలాండ్‌లోని హవాయి, కిలౌయాలోని మూడు యాక్టివ్ అగ్నిపర్వతాలలో ఒకటి అత్యంత ప్రమాదకరమైనది. 2014లో దాని నుంచి లావా ఎగిరి పహోవా పట్టణానికి చేరుకుంది.
నార్త్ యుంగాస్ రోడ్, యుకాటన్ సెనోట్స్
బొలీవియాలోని నార్త్ యుంగాస్ రోడ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి. పైగా ఈ నార్త్ యుంగాస్ రోడ్ మౌంటెన్ బైక్ రైడర్లకు స్పాట్‌గా మారింది. ఎగుడూ దిగుడుగా ఉండటంతోపాటు 40 మైళ్ల (సుమారు 65-కిమీ) రహదారి ఇరుకైన రాంగ్ రూట్ మాదిరి ఉంటుంది. ఇక్కడ జర్నీ ప్రమాదకరం. ఒక కరేబియన్‌లోని అత్యంత సుందరమైన అలాగే డేంజరస్ టూరిస్టు స్పాట్లలో బాయిలింగ్ లేక్ ఒకటి. ఫ్యూమరోల్‌తో నిండిపోయింది. ఇది భూమి యొక్క క్రస్ట్‌పై పగుళ్లు ఏర్పడి ఉంటుంది. వేడి నీటి బుడగలను వెదజిమ్ముతూ ఉంటుంది. ఒకవేళ ఈ లేక్ నీటి దగ్గరకు వెళ్తే ప్రాణం పోయినట్టే. ఇక మెక్సికోలోని యుకాటన్ సెనోట్స్ అనేవి ఇక్కడి యుకాటాన్ ద్వీపకల్పంలోని అడవి భాగంలో ఉంటాయి. ఇవి ప్రపంచంలోని మూడు పొడవైన అండర్ వాటర్ గుహ వ్యవస్థలు ఉన్నాయి. ఈ అన్‌మ్యాప్డ్ గుహ వ్యవస్థలు డైవర్స్‌కు అద్భుతంగా మారాయి. వారు సహజమైన సింక్‌హోల్స్ మధ్య మార్గాలను అన్వేషించాలనుకుంటున్నారు. వీటిని సెనోట్స్ అని పిలుస్తారు. అయినప్పటికీ ఇరుకైన ప్రదేశాలు, చీకటి, అయోమయ స్థితి ప్రాణాంతక సంఘటనలకు దారి తీస్తుంది.
కెనడియన్ రాకీస్, యూఎస్‌లోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్
కెనడాలోని హిమపాతాలు రాక్ ఫాల్స్ నుంచి పర్వత సింహాలను ఎదుర్కొనే వరకు, కెనడియన్ రాకీస్ ప్రమాదంతో నిండి ఉన్నాయి. 2019లో హౌస్ శిఖరం యొక్క రిమోట్ ఫేస్ స్కేల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ముగ్గురు పర్వతారోహకులు హిమపాతంలో కూరుకుపోయి మరణించారు. ఇక యూఎస్, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రధానంగా వ్యోమింగ్‌లో ఉన్న ఈ ఉద్యానవనం మోంటానా, ఇడాహో ప్రాంతాలకు కూడా విస్తరి ఉంది. ఇక్కడ అగ్నిపర్వత హాట్ స్పాట్స్ ఉంటాయి. అలాగే హైకర్లు. క్యాంపర్లు తరచూ గ్రిజ్లీ ఎలుగుబంట్ల దాడికి గురవుతుంటారు. సగటున సంవత్సరానికి ఒక ఎలుగుబంటి దాడి, మరణం అయినా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు స్విడ్జర్లాండ్‌లోని వెర్జాస్కా డ్యామ్, నేపాల్ అన్నపూర్ణ I పర్వతం, ఈజిప్ట్‌లోని బ్లూ హోల్, స్విడ్జర్లాండ్‌లోని ట్రిఫ్ట్ బ్రిడ్జ్ వంటివి అందమైన ప్రపంచ పర్యాటక ప్రదేశాలే కాదు, ప్రమాదాలు పొంచి ఉన్న డెత్ స్పాట్‌గాను ప్రసిద్ధి. అయినప్పటికీ టూరిస్టులు వాటిని చూసేందుకు క్యూరియాసిటీ ప్రదర్శిస్తుంటారు.