చికెన్ తో పెరుగు మిక్స్ చేసి వండుతున్నారా.. ?

by Prasanna |
చికెన్ తో పెరుగు మిక్స్ చేసి వండుతున్నారా.. ?
X

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్‌తో చేసిన ఏదైనా రుచిగానే ఉంటుంది. దీనితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా కూరలు, బిర్యానీ, పులావ్ ఎక్కువగా చేస్తారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, చాలా ఆరోగ్యకరమైనది కూడా. దీనిలో రకరకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలా అని చికెన్ ఎక్కువగా తినకూడదు. దీని వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ తో పెరుగు మిక్స్ చేసి తినేవారికి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మీరు చికెన్ తినేటప్పుడు కొన్ని ఆహారాలను దూరం పెట్టాలి. లేదంటే కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో .. నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇది అలెర్జీలు, చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. తీవ్రమైన అనారోగ్యాలు కూడా సంభవించవచ్చు.

ఈ మధ్యకాలంలో చాలా మంది చికెన్ తో పెరుగు మిక్స్ చేసి వండుతున్నారు. కానీ, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు. ఇలా తింటే జీర్ణ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed