ఆనందంగా ఉండాలంటే డబ్బే ముఖ్యమా?.. ఇంకేం కావాలో తెలుసా?

by Javid Pasha |
ఆనందంగా ఉండాలంటే డబ్బే ముఖ్యమా?.. ఇంకేం కావాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మానవ సంబంధాలన్నీ డబ్బుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. వాస్తవంలోనూ ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజుల్లో దేనికైనా డబ్బు అవసరం. అలాగని అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ అదే సర్వసం అనుకున్నా పొరపాటే. ఎందుకంటే మీ వద్ద ఎంత మనీ ఉన్నప్పటికీ టాలెంట్‌ను, హ్యాపీనెస్‌ను కొనలేరు. అయితే తాజాగా డబ్బుకు హ్యాపీనెస్‌కు మధ్యగల సంబంధాన్ని తెలుసుకునే ఉద్దేశంతో హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన కొందరు పరిశోధకులు 30 వేలమందిని స్టడీ చేశారు. దీని ప్రకారం వ్యక్తుల ఆదాయం పెరిగినప్పుడు వారిలో ఆనందం కూడా పెరుగుతుందని, కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయని గుర్తించారు. పైగా హై ఇన్‌కం పీపుల్స్‌తో పోల్చితే లో ఇన్‌కం పీపుల్స్ తక్కువ సంతోషంగా ఉంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయని గమనించారు. అలాగని కేవలం డబ్బుతోనే జీవితమంతా ఆనందాన్ని ఆస్వాదిస్తారనేది కూడా కరెక్ట్ కాదంటున్నారు రీసెర్చర్స్. కాకపోతే ఆనందంగా ఉండాలంటే డబ్బు కూడా జీవితంలో ఒక భాగంగా పేర్కొంటున్నారు. ఇక డబ్బును పక్కన పెడితే మనుషుల మధ్య అనుబంధాలు, ఆసక్తులు, సక్సెస్ జర్నీస్, వివిధ హాబీస్ వంటివన్నీ సంతోషాన్ని ఇచ్చే అంశాలుగా ఉంటున్నాయి. ఫైనల్‌గా నిపుణుల విశ్లేషణ ఏంటంటే జీవితంలో డబ్బు ముఖ్యమే కానీ అదే సర్వస్వం కాదు. ఆనందంగా జీవించడానికి డబ్బుతోపాటు మానవ సంబంధాలు ముఖ్యం.

Advertisement

Next Story

Most Viewed