- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిలకు కోమటిరెడ్డి సపోర్ట్.. సంచలనం రేపుతున్న ఫోన్‌కాల్(వీడియో)
దిశ, చండూరు: చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఇటీవల పుల్లెంలో నిరుద్యోగి పాక శ్రీకాంత్ మృతికి సంతాపంగా వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ షర్మిలకు ఫోన్ చేశారు.
షర్మిలతో ఫోన్‌లో రాజగోపాల్ రెడ్డి మాటలు ఇవే..
‘వైఎస్‌ఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు అభినందనీయం. మేము బతికున్నంత కాలం మా గుండెల్లో వైఎస్ఆర్ ఉంటారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేయకపోవడంతో ఎందరో నిరుద్యోగుల వయసు పెరిగి.. అర్హులు కాకుండా పోయారు. కేసీఆర్ నియంత పాలన పోవాలంటే ఆయన్ను ఇంటి బాట పట్టించాలి. నిరుద్యోగుల కోసం షర్మిల చేస్తున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. ఈ దీక్ష కార్యక్రమంలో చండూరు మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు’. అంటూ రాజగోపాల్ రెడ్డి షర్మిలకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిల ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.